China Influencer | పెగ్గు మీద పెగ్గు కొట్టి.. మరణించిన చైనా ఇన్‌ఫ్లూయెన్సర్
China Influencer | చైనాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు లైవ్ చాలెంజ్‌లో భాగంగా ప్రాణాలు కోల్పోయాడు. 34 ఏళ్ల సానికేంజి అనే ఇన్‌ఫ్లూయెన్సర్ శనివారం రాత్రి లైవ్‌లో చైనా వోడ్కా (బైజియు)ను తాగడం మొదలు పెట్టాడు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సీసా మీద సీసా ఎత్తాడు. అలా ఏకంగా ఏడు సీసాల వోడ్కా తాగి లైవ్‌ను ముగించాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు అతడి లైవ్ ముగియగా.. మధ్యాహ్నం అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. చైనా టిక్‌టాక్ […]

China Influencer |
చైనాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒకరు లైవ్ చాలెంజ్‌లో భాగంగా ప్రాణాలు కోల్పోయాడు. 34 ఏళ్ల సానికేంజి అనే ఇన్‌ఫ్లూయెన్సర్ శనివారం రాత్రి లైవ్‌లో చైనా వోడ్కా (బైజియు)ను తాగడం మొదలు పెట్టాడు. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సీసా మీద సీసా ఎత్తాడు. అలా ఏకంగా ఏడు సీసాల వోడ్కా తాగి లైవ్‌ను ముగించాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు అతడి లైవ్ ముగియగా.. మధ్యాహ్నం అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు.
చైనా టిక్‌టాక్ అయిన డావిన్‌లో ఈ లైవ్ వీడియోను లక్షల మంది వీక్షించారు. తోటి ఇన్‌ఫ్లూయెన్సర్‌కు పోటీగా పీకే ఛాలెంజ్ పేరుతో సానికేంజి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన వారికి బహుమతులు, ఓడిన వారికి కఠిన శిక్ష విధించాలని ఘటనకు ముందు వీరిద్దరూ తమ ఫాలోవర్లను అభ్యర్థించారు. కొంత మంది స్నేహితులు మృతుడు ఛాలెంజ్‌లో ఓడిపోయినందుకు శిక్షలో భాగంగా వోడ్కా తాగాడని చెబుతుంగా.. మరి కొందరు ఇది ఛాలెంజ్‌లో ఒక భాగమని చెబుతున్నారు.
చైనా ఇన్‌ఫ్లూయెన్సర్‌ల అతి చేష్టలు
మార్కెట్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా స్థిరపడి డబ్బు సంపాదింద్దామనుకుంటున్న వారి సంఖ్య చైనాలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ప్రేక్షకులను ఆకర్షించడానికి కొన్నిసార్లు వీరు ప్రమాదకరమైన పనులు చేయడానికి వెనుకాడటం లేదు.
తాజా ఘటనలో అతడు తీసుకున్న చైనా వోడ్కాలో 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మరణం ఖాయమని చైనా అధికారులు తెలిపారు. ఈ నెలలోనే జరిగిన మరో ఘటనలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయినట్లు అందరినీ నమ్మించిన ఓ ఇన్‌ఫ్లూయెన్సర్.. అగ్నిమాపక అధికారులు అతడ్ని రక్షించడాన్ని వీడియో తీసి పోస్ట్ చేశాడు.