Chinese Cyber Gang | చైనా సైబర్ ముఠా మాయలో రూ.712కోట్ల హంఫట్‌

Chinese Cyber Gang అధిక లాభాల వలలో బాధితుల విలవిల హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి విధాత: పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామంటు చైనా కేంద్రంగా సైబర్ ముఠా వేసిన వలలో చిక్కుకున్న బాధితుల నుండి 712కోట్ల రూపాయలు చైనా సంస్థలకు వెళ్లి అక్కడి నుండి ఉగ్ర వాద సంస్థలు ఉపయోగించే క్రిఫ్టో వెబ్‌సైట్‌కు బదిలీయైనట్లుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైద్రాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియ సమావేశంలో ఆయన ఈ భారీ […]

Chinese Cyber Gang | చైనా సైబర్ ముఠా మాయలో రూ.712కోట్ల హంఫట్‌

Chinese Cyber Gang

  • అధిక లాభాల వలలో బాధితుల విలవిల
  • హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి

విధాత: పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామంటు చైనా కేంద్రంగా సైబర్ ముఠా వేసిన వలలో చిక్కుకున్న బాధితుల నుండి 712కోట్ల రూపాయలు చైనా సంస్థలకు వెళ్లి అక్కడి నుండి ఉగ్ర వాద సంస్థలు ఉపయోగించే క్రిఫ్టో వెబ్‌సైట్‌కు బదిలీయైనట్లుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైద్రాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియ సమావేశంలో ఆయన ఈ భారీ స్కామ్ వివరాలను వెల్లడించారు.

చిక్కడపల్లికి చెందిన బాధితుడి ఫిర్యాదుతో తీగ లాగగా, చైనా సైబర్ ముఠా దోపిడి బట్టబయలైందని తెలిపారు. ముఠాలోని తొమ్మిది మందిని అరెస్టు చేశామని, హైద్రాబాద్‌, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన పలువురు ముఠాగా ఏర్పడి బాధితులకు అధిక లాభాల ఆఫర్లతో వల వేయడం చేశారని వివరించారు.

నిందితులకు హిజ్భుల్ ఉగ్రవాద సంస్థలతో లింకులున్నట్లుగా గుర్తించామని, సైబర్ క్రైమ్‌లో దోచుకున్న సొమ్మును ఉగ్రవాదులకు బదిలీ చేస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నామన్నారు. నిందితుల నుండి 17సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్‌లు, 22సిమ్ కార్డులు, నాలుగు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.

సీపీ తెలిపిన కేసు వివరాల్లోకి వెళితే మోసం చేసే క్రమంలో ముందుగా ముఠా నుండి బాధిత ఫిర్యాదు దారుడికి టెలీగ్రామ్ యాప్ ద్వారా రేట్ ఆండ్ రివ్యూ పేరుతో తొలుత పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ చేశారు. తర్వాతా ట్రావెలింగ్ బూస్ట్ 99.కామ్‌లో అతడి పేరు రిజిస్ట్రర్ చేసుకోగా, వైబ్ సైట్ ద్వారా ఐదు టాస్కులు వచ్చాయి.

ముందుగా వేయి రూపాయలు పెట్టుబడి పెడితే బాధితుడికి 866రూపాయలు లాభం వచ్చింది. దీంతో అతడు పలుమార్లు పెట్టిన పెట్టుబడులకు వచ్చిన నగదు ఆన్‌లైన్‌లో వాలెట్‌లో డిస్ ప్లే చేశారు. అందులో చూపించిన మొత్తాన్ని మాత్రం విత్‌డ్రా చేసుకునే అవకాశం లేక బాధితుడు 28లక్షలు నష్టపోయాడు.

అలా బాధితుడికి వచ్చిన 28లక్షలు రాధికా మార్కెటింగ్ పేరుతో ఉన్న అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాక, అక్కడి నుంచి పలు బ్యాంకుల అకౌంట్లలోకి బదిలీ చేశారు. ఆ డబ్బును పలు మార్గాల్లో క్రిఫ్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనాకు, ఉగ్రవాదులు ఉపయోగించే క్రిఫ్టో వెబ్‌సైట్‌కు మళ్లీంచినట్లుగా సీపీ ఆనంద్ వెల్లడించారు.

ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. అవినీతి సొమ్మును స్వాహా చేసేందుకు బ్యాంకు అకౌంట్లతో పాటు షెల్ అకౌంట్లను సిద్ధం చేసుకున్నారని, రాధిక మార్కెటింగ్ ఖాతాను హైద్రాబాద్‌కు చెందిన మహ్మద్ మున్వర్ నిర్వహిస్తున్నాడని గుర్తించామన్నారు.

చైనాకు చెందిన ల్యో, నాన్‌యే, కేవిన్ జూన్‌లు ఈ దోపిడీలో ప్రధాన నిందితులని, ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసేందుకు రెండు లక్షల రూపాయలు చైనా ముఠా ఇస్తుందన్నారు. ఇలా ఆహ్మదాబాద్‌కు చెందిన ప్రజాప్రతి 65 అకౌంట్లను ఓపెన్ చేయించి చైనీయులకు అప్పగించాడని, తద్వారా 125కోట్ల రూపాయల లావాదేవీలు సాగాయన్నారు.

ఈ పెట్టుబడి మోసాలకు సంబంధించి ఇప్పటికే 15కేసులు నమోదు చేశామని, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు.