నాలుగో రోజుకు చేరిన సివిల్ సప్లై కూలీల సమ్మె
విధాత, నిజామాబాదు: సివిల్ సప్లై హమాలీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా శనివారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ తహసిల్దార్ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, డివిజన్ కన్వీనర్ డి శంకర్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరుకుందన్నారు. అయినా సివిల్ […]

విధాత, నిజామాబాదు: సివిల్ సప్లై హమాలీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా శనివారం నాటికి నాలుగవ రోజుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ తహసిల్దార్ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది.
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, డివిజన్ కన్వీనర్ డి శంకర్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరుకుందన్నారు. అయినా సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, పౌర సరఫరా శాఖ మంత్రి ఇంత వరకు స్పందించక పోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎగుమతి, దిగుమతి క్వింటాలుకు 30 రూపాయలకు పెంచాలని, దసరా బోనస్ పదిహేను వేల రూపాయలతో పాటు స్వీట్ కు 1500 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో పి సాయిలు, భూమయ్య, జి సాయిలు, హనుమాన్లు, షాబుద్దీన్, లక్ష్మి, ఆర్ సాయిలు, ధర్మం తదితరులు పాల్గొన్నారు.