Cloth Bag ATM | హైద‌రాబాద్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్ ప్రారంభం.. రూ. 10ల‌కే క్లాత్ బ్యాగ్

విధాత‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దిశ‌గా తొలి అడుగు ప‌డింది. కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని ఐడీపీఎల్ ఏరియాలో ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్‌ (Cloth Bag ATM)ను జీహెచ్ఎంసీ అధికారులు శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. ఈ మెషీన్‌లో ప‌ది రూపాయాల నోటును ఇన్‌సర్ట్ చేస్తే.. క్ష‌ణాల్లో క్లాత్‌తో కూడిన క్యారీ బ్యాగ్ వ‌స్తుంది. ఈ క్లాత్ బ్యాగ్‌లు దాదాపు 5 కిలోల బ‌రువును భ‌రించే సామ‌ర్థ్యంతో త‌యార‌య్యాయి. ఎనీ […]

Cloth Bag ATM | హైద‌రాబాద్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్ ప్రారంభం.. రూ. 10ల‌కే క్లాత్ బ్యాగ్

విధాత‌: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దిశ‌గా తొలి అడుగు ప‌డింది. కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని ఐడీపీఎల్ ఏరియాలో ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్‌ (Cloth Bag ATM)ను జీహెచ్ఎంసీ అధికారులు శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు.

ఈ మెషీన్‌లో ప‌ది రూపాయాల నోటును ఇన్‌సర్ట్ చేస్తే.. క్ష‌ణాల్లో క్లాత్‌తో కూడిన క్యారీ బ్యాగ్ వ‌స్తుంది. ఈ క్లాత్ బ్యాగ్‌లు దాదాపు 5 కిలోల బ‌రువును భ‌రించే సామ‌ర్థ్యంతో త‌యార‌య్యాయి. ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్‌ను సోలార్ విద్యుత్ వినియోగించుకుని ప‌ని చేసేలా రూపొందించారు.

మొవేట్‌, యునైటెడ్ వే ఆఫ్ హైద‌రాబాద్ సంస్థ‌లు ఈ ఎనీ టైమ్ బ్యాగ్ మెషీన్ ప్రాజెక్టును ఆవిష్క‌రించాయి. అయితే ఈ బ్యాగుల‌ను కూర‌గాయ‌లు, కిరాణ స‌రుకులు తెచ్చేందుకు వినియోగించుకోవ‌చ్చు. ఈ మెషీన్‌ల‌ను త్వ‌ర‌లోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్నారు