సొంత ఎమ్మెల్యేలపైనే సీఎం బ్లాక్‌మెయిల్: మాజీ ఎంపీ బూర
విధాత: సొంత ఎమ్మెల్యేలని కూడా వదలకుండా సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, కేసీఆర్ కూతురు కవిత ఓటమి వెనుక టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఉందనే ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయని బీజేపీ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు. కవితను బీజేపీలో చేరమని కోరామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కవిత కాదు, టీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్ […]

విధాత: సొంత ఎమ్మెల్యేలని కూడా వదలకుండా సీఎం కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, కేసీఆర్ కూతురు కవిత ఓటమి వెనుక టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఉందనే ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయని బీజేపీ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
కవితను బీజేపీలో చేరమని కోరామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కవిత కాదు, టీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫాంహౌస్ ఘటనను సీబీఐ, లేదా హైకోర్టు మాత్రమే విచారణ చేయాలన్నారు. బీసీల ఆర్థిక అణిచివేతకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. బీసీ ఫెడరేషన్‌కు ఎనిమిదేళ్లలో రూ. 230 కోట్లే కేటాయించడం దారుణమన్నారు.