రాష్ట్రంలో రోడ్లపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, వేముల, విశ్రీనివాస్‌గౌడ్ విధాత: రాష్ట్రంలో రోడ్ల పరిస్థతిపై గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది. రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతు లు చేయడం వంటి తదితర అంశాలను చర్చించారు. అలాగే పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ… పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు […]

హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, వేముల, విశ్రీనివాస్‌గౌడ్
విధాత: రాష్ట్రంలో రోడ్ల పరిస్థతిపై గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది. రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతు లు చేయడం వంటి తదితర అంశాలను చర్చించారు.
అలాగే పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ… పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు.. తదితర కార్యాచరణ పై సమీక్షించారు.
సమావేశంలో మంత్రులు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, దానం నాగేందర్, మైనంపల్లి హన్మంతరావులతో పాటు, సీఎస్ సోమేశ్ కుమార్,
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, సంజీవరావు, ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, రవీందర్ రావు, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.