నేడు మంత్రులు, జిల్లాల అధ్యక్షులతో సీఎం కేసీఆర్ లంచ్‌

విధాత‌, హైద‌రాబాద్‌: మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ నేడు భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఉదయం ఎంజీ రోడ్డుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాలను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. తర్వాత గాంధీ హాస్పిటల్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో మాట్లాడునున్నారు. అనంత‌రం అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుని మంత్రులు, జిల్లా అధ్యక్షులతో కలిసి కేసీఆర్ భోజనం […]

నేడు మంత్రులు, జిల్లాల అధ్యక్షులతో సీఎం కేసీఆర్ లంచ్‌

విధాత‌, హైద‌రాబాద్‌: మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులతో కేసీఆర్ నేడు భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఉదయం ఎంజీ రోడ్డుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాలను కేసీఆర్ ఆవిష్కరిస్తారు.

తర్వాత గాంధీ హాస్పిటల్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో మాట్లాడునున్నారు. అనంత‌రం అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుని మంత్రులు, జిల్లా అధ్యక్షులతో కలిసి కేసీఆర్ భోజనం చేస్తారు. ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ గురించి పలు అంశాలను వారితో పంచుకుంటారని తెలుస్తోంది.

పార్టీని కేటీఆర్ లీడ్ చేయడం సహా ఇతర అంశాలపై వివరిస్తారని ముఖ్య నేతలు చెప్పారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లాలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు చేయనున్నారు.