తిర‌గ‌బ‌డాల్సిందే.. అద్భుత‌మైన భార‌త నిర్మాణానికి పునాదులు వేయాల్సిందే: కేసీఆర్

CM KCR | ఈ దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డాల్సిందే.. అద్భుత‌మైన భార‌త‌దేశ నిర్మాణానికి తెలంగాణ గ‌డ్డ నుంచే పునాదులు వేసి మ‌న పేరు బంగారు అక్ష‌రాల‌తో రాసే విధంగా ముందుకు పోదామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పాల‌మూరు జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మ‌నం ఒక్క‌రం బాగుప‌డితే కాదు. దేశం కూడా బాగుప‌డాలి. అందుకోసం క‌చ్చితంగా తెలంగాణ త‌ర‌ఫున, మ‌నంద‌రి త‌ర‌ఫున జాతీయ రాజ‌కీయాల్లో […]

తిర‌గ‌బ‌డాల్సిందే.. అద్భుత‌మైన భార‌త నిర్మాణానికి పునాదులు వేయాల్సిందే:  కేసీఆర్

CM KCR | ఈ దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డాల్సిందే.. అద్భుత‌మైన భార‌త‌దేశ నిర్మాణానికి తెలంగాణ గ‌డ్డ నుంచే పునాదులు వేసి మ‌న పేరు బంగారు అక్ష‌రాల‌తో రాసే విధంగా ముందుకు పోదామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పాల‌మూరు జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌నం ఒక్క‌రం బాగుప‌డితే కాదు. దేశం కూడా బాగుప‌డాలి. అందుకోసం క‌చ్చితంగా తెలంగాణ త‌ర‌ఫున, మ‌నంద‌రి త‌ర‌ఫున జాతీయ రాజ‌కీయాల్లో కూడా చురుకైన పాత్ర వ‌హించాలి. బీఆర్ఎస్‌కు పోదామా? క‌చ్చితంగా పోదామా? ఇక్క‌డ మీరు గ‌ట్టిగా చూసుకుంటామంటే.. నేను అక్క‌డ గ‌ట్టిగా చూస్తా. అంద‌రం క‌లిసి పోదాం.

ఈ దేశం బాగుప‌డితేనే అంద‌రం బాగుపడుతాం కాబ‌ట్టి క‌చ్చితంగా తెలంగాణ లాగా భార‌త‌దేశాన్ని త‌యారు చేయ‌డానికి భగ‌వంతుడు ఇచ్చిన స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాల‌ను ప్ర‌భావితం చేద్దాం.. అద్భుత‌మైన భార‌త‌దేశ నిర్మాణానికి తెలంగాణ గ‌డ్డ నుంచే పునాదులు వేసి మ‌న పేరు బంగారు అక్ష‌రాల‌తో రాసే విధంగా ముందుకు పోదామ‌ని తెలియ‌జేస్తున్నాను అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు హైద‌రాబాద్‌కు దొంగ‌లు వ‌చ్చారు. అణ‌గ‌వ‌ట్టి, దొర‌క‌బ‌ట్టి జైల్లో వేశాం. ఎక్క‌డ్నుంచో దేశంలో తిరుగుబాటు ప్రారంభం కావాలి. తిరుగుబాటు చేయ‌క‌పోతే, ప్ర‌తి ఘ‌టించ‌క‌ పోతే, ఆనాడు మ‌నం కొట్లాడ‌క‌పోతే, తెగించ‌క‌పోతే తెలంగాణ రాక‌పోవు. మ‌న గ‌తి అట్ల‌నే ఉంటుండే. గాంధీ నాయ‌క‌త్వంలో వేల మంది పోరాటం చేసి ఉండ‌క‌పోతే ఇవాళ్టికి కూడా మ‌నం బానిస‌లుగా ఉండే వాళ్లం. దేశంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.