జాతీయ పార్టీ ఏర్పాటు: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

విధాత‌, యాదాద్రి భువ‌న‌గిరి: సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ప్రకటించే ముందు యాదాద్రి శ్రీ‌ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. అయితే.. సీఎం కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో భారతీయ రాష్ట్ర సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు […]

  • By: Somu    latest    Sep 29, 2022 10:00 AM IST
జాతీయ పార్టీ ఏర్పాటు: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

విధాత‌, యాదాద్రి భువ‌న‌గిరి: సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ప్రకటించే ముందు యాదాద్రి శ్రీ‌ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది.

అయితే.. సీఎం కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో భారతీయ రాష్ట్ర సమితి పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 5వ తేదీకి ముందే సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు.

2024లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇందు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ అధ్యయం చేశారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఈ విషయమై కేసీఆర్‌తో కలిసి పని చేసింది.

రైతులు, విద్యార్ధులు, మహిళలు, యువత ఏం కోరుకుంటున్నారనే విషయమై కేసీఆర్ టీమ్ అధ్యయనం చేసింది. ప్రజల డిమాండ్లను జాతీయ పార్టీ ఎజెండాలో కేసీఆర్ చేర్చనున్నారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ పార్టీ ఏర్పాటుపై కసరత్తులు నిర్వహిస్తున్నారు.

పార్టీ ఏర్పాటు కంటే ముందుగానో ఆ తర్వాతో కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు. 2018 ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కూడా కేసీఆర్ యాగం నిర్వహించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఢిల్లీ లేదా యూపీలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలో తమ పార్టీ విధానాలను కేసీఆర్ ప్రకటించనున్నారు.

మరో వైపు అక్టోబర్ లో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. పలు పార్టీల నేతలను కూడా సీపీఐ నేతలు మహసభలకు ఆహ్వానించారు. ఈ మహాసభల వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిపై సంకేతాలను ఇవ్వాలని సీపీఐ భావిస్తుంది.