రాష్ట్ర‌ప‌తి ముర్ముకు.. సీఎం కేసీఆర్ ఘ‌న‌స్వాగ‌తం

విధాత‌: శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హ‌కీంపేట్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ముర్మును కేసీఆర్ శాలువాతో స‌త్క‌రించి, పుష్ప‌గుచ్ఛం అందించారు. రాష్ట్ర‌ప‌తి ముర్ముకు స్వాగ‌తం ప‌లికిన వారిలో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ఆర్మీ, నేవీ అధికారులు ఉన్నారు. అనంత‌రం భార‌త సైనికుల గౌర‌వ […]

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు.. సీఎం కేసీఆర్ ఘ‌న‌స్వాగ‌తం

విధాత‌: శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హ‌కీంపేట్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ముర్మును కేసీఆర్ శాలువాతో స‌త్క‌రించి, పుష్ప‌గుచ్ఛం అందించారు.

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు స్వాగ‌తం ప‌లికిన వారిలో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ఆర్మీ, నేవీ అధికారులు ఉన్నారు.

అనంత‌రం భార‌త సైనికుల గౌర‌వ వంద‌నాన్ని ద్రౌప‌ది ముర్ము స్వీక‌రించారు. ఇక చాలా రోజుల త‌ర్వాత‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, కేసీఆర్ ఒకే వేదిక‌ను పంచుకున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ముర్ము బ‌స చేయ‌నున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తి.. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో శ్రీశైలం వెళ్లారు. అక్క‌డ మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం హ‌కీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.