CM KCR: మైనారిటీ సంక్షేమం కోసం రూ.13 వేల కోట్లు కేటాయించాం.. ముస్లిం సహోదరులకు CM KCR రంజాన్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, విధాత: ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సిఎం కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. మైనారిటీల అభివృద్ధి […]

  • By: krs    latest    Apr 21, 2023 4:11 PM IST
CM KCR: మైనారిటీ సంక్షేమం కోసం రూ.13 వేల కోట్లు కేటాయించాం.. ముస్లిం సహోదరులకు CM KCR రంజాన్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, విధాత: ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సిఎం కోరుకున్నారు.

అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి కొనసాగుతూనే ఉంటుందని సిఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు.

తెలంగాణలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాఫ్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.

ముస్లిం సోదరులకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

ముస్లింలకు సోదర సోదరీమణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రంజాన్‌ పర్వదినంగా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ అని ఆయన అన్నారు. రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ాయన తెలిపారు.