Development works | రామాయంపేటలో అభివృద్ధి పనులు.. ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ రాజర్షి షా
పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ Development works, విధాత, మెదక్ బ్యూరో: రామాయంపేటలో పలు అభివృద్ధి, ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ (Collector Pratima Singh) తో కలిసి శుక్రవారం రామాయం పేట […]

పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
Development works, విధాత, మెదక్ బ్యూరో: రామాయంపేటలో పలు అభివృద్ధి, ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ (Collector Pratima Singh) తో కలిసి శుక్రవారం రామాయం పేట (Ramayampet)లో సుడిగాలి పర్యటన చేసి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇండ్లు, వైకుంఠ ధామం, వెజ్, నాన్-వెజ్ మార్కెట్ (Veg, non-veg market) లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాయంపేటలో నిర్మిస్తున్న 304 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మిగిలి పోయిన చిన్న చిన్న పనులను ఈ నెల 8 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సెప్టిక్ ట్యాంక్, మురుగు కాలువల నిర్మాణం పూర్తి కాగా విద్యుత్, మంచి నీటి సౌకర్యం వంటి మిగిలిన కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
వైకుంఠ ధామం, వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి మెటీరియల్ సిద్ధంగా ఉంచుకొని కూలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని, నాణ్యతలో రాజీపడకుండా అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణాలను అందించేలా వేగవంతంగా పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ వార్డులను సందర్శించి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు ఉన్నందున ఆసుపత్రి సేవలను వినియోగించుకోవలసినదిగా ప్రజలకు సూచించారు. గర్భిణీకి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించి సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులకు ప్రాధాన్యత నివ్వాలని, బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్ అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న కాన్పుల సంఖ్య పెంచాలని, నూతనంగా వచ్చిన ఎక్స్ రే మిషన్ను త్వరలో అందుబాటులో ఉంచాలని, ఎన్సీడీ. కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆసుపత్రిలోని అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, మందుల స్టాక్ రిజిస్టర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలని సూచించారు.