హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు
condoms,pills,cigarettes: దేశ భవిశ్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకొంటుందని అంటారు. అక్షర జ్ఞానంతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వం, మూర్తిమత్వం రూపొందే పాఠశాల చదువుల సమయంలోనే విద్యార్థులు పెడదారి పడితే అది వారి వ్యక్తిగత జీవితాలకే కాదు, మొత్తంగా దేశ భవిష్యత్తుకే విఘాతం. బెంగళూరులోని కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల పుస్తకాల సంచుల్లో పెడ ధోరణులకు హేతువులైన అనేక పరికరాలు బయట పడటంతో అక్కడి పాఠశాల యాజమాన్యాలు సెల్‌ఫోన్లను నిషేధించాయి. స్మార్ట్ ఫోన్లే విద్యార్థుల చెడు పోకడలకు కారణమని భావించి విద్యార్థుల […]

condoms,pills,cigarettes: దేశ భవిశ్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకొంటుందని అంటారు. అక్షర జ్ఞానంతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వం, మూర్తిమత్వం రూపొందే పాఠశాల చదువుల సమయంలోనే విద్యార్థులు పెడదారి పడితే అది వారి వ్యక్తిగత జీవితాలకే కాదు, మొత్తంగా దేశ భవిష్యత్తుకే విఘాతం.
బెంగళూరులోని కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల పుస్తకాల సంచుల్లో పెడ ధోరణులకు హేతువులైన అనేక పరికరాలు బయట పడటంతో అక్కడి పాఠశాల యాజమాన్యాలు సెల్‌ఫోన్లను నిషేధించాయి. స్మార్ట్ ఫోన్లే విద్యార్థుల చెడు పోకడలకు కారణమని భావించి విద్యార్థుల బ్యాగుల్లో సెల్ పోన్లు తెస్తున్నారేమోనని ఆకస్మిక తనఖీలు చేశారు.
ఈ క్రమంలో బెంగళూరు నాగరబావి పరిసర ప్రాంతంలోని పాఠశాలల్లో 8 నుంచి 10 వ తరగతి చిదివే విద్యార్థుల బ్యాగులను తెరిచి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అనేక మంది విద్యార్థుల పుస్తకాల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు దొరకటంతో చూసిన వారంతా విస్తుపోయారు.
కర్ణాటకకు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం కూడా ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు మానసిక కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ స్థాయిలో విద్యార్థులు విపరీత ధోరణులకు పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థిలోకాన్ని ఏ విధంగా సంరక్షించు కోవాలో ఆలోచిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తు అంధకార బంధురమేనని ఆందోళన చెందుతున్నారు.