Congress | బీజేపీ కార్యాలయాలుగా గుజరాత్ కోర్టులు: పొన్నం
Congress విధాత: గుజరాత్ కోర్టులు బీజేపీ కార్యాలయాలు అయ్యాయని ప్రజలు అనుకుంటున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను ఇలా అణిచివేయడం చేస్తే సహించేది లేదన్నారు. రాహుల్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రకు అశేష స్పందన రావడంతో బిజెపి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయిందన్నారు. రాహుల్ ఒంటరి కాదు.. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పిటీషన్‌ను గుజరాత్ […]

Congress
విధాత: గుజరాత్ కోర్టులు బీజేపీ కార్యాలయాలు అయ్యాయని ప్రజలు అనుకుంటున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను ఇలా అణిచివేయడం చేస్తే సహించేది లేదన్నారు. రాహుల్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రకు అశేష స్పందన రావడంతో బిజెపి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయిందన్నారు. రాహుల్ ఒంటరి కాదు.. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పిటీషన్‌ను గుజరాత్ హైకోర్టు విచారణ చేయకుండా తిరస్కరించడానికి నిరసనగా శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. పలు చోట్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు.
మోదీ డౌన్ డౌన్ , బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మోదీ దిష్టి బొమ్మలు దగ్గం చేశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ట్యాంకుబండ్ వద్ద దగ్ధం చేశారు.
వేములవాడ పట్టణంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో వేములవాడ బ్రిడ్జి ముందు నిరసన వ్యక్తం చేశారు.