Congress | గాంధీ భవన్ వద్ధ.. పాల్వాయి స్రవంతి నిరసన

Congress కమిటీలపై లొల్లి అధికార సాధన సంకేతమన్న రేవంత్‌ విధాత: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ మండల కమిటీల నియామకంలో తన వర్గీయులకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పాల్వాయి స్రవంతిని లోనికి వెళ్లకుండా గాంధీభవన్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ పరిణామంపై స్రవంతి తన వర్గీయులతో నిరసన వ్యక్తం చేశారు. లోపల భూమి డిక్లరేషన్ సమావేశంలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్రవంతి విషయం తెలుసుకుని బయటకు వచ్చి ఆమెతో మాట్లాడి సర్ది చెప్పే ప్ర‌యత్నం […]

Congress | గాంధీ భవన్ వద్ధ.. పాల్వాయి స్రవంతి నిరసన

Congress

  • కమిటీలపై లొల్లి అధికార సాధన సంకేతమన్న రేవంత్‌

విధాత: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ మండల కమిటీల నియామకంలో తన వర్గీయులకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పాల్వాయి స్రవంతిని లోనికి వెళ్లకుండా గాంధీభవన్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ పరిణామంపై స్రవంతి తన వర్గీయులతో నిరసన వ్యక్తం చేశారు.

లోపల భూమి డిక్లరేషన్ సమావేశంలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్రవంతి విషయం తెలుసుకుని బయటకు వచ్చి ఆమెతో మాట్లాడి సర్ది చెప్పే ప్ర‌యత్నం చేశారు. స్రవంతి మాత్రం తన నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల కమిటీల నియామకం ఏకపక్షంగా ఉందంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇచ్చిన కమిటీల పేర్లనే ఖరారు చేశామని రేవంత్ రెడ్డి ఆమెకు వివరించారు. ఈ వివాదంపై మీడియా సమావేశంలో స్పందించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మండల, గ్రామ కమిటీలలో స్థానం కోసం గట్టి పోటీ నెలకొందని ఈ పరిణామం క్షేత్ర స్థాయిలో పెరిగిన కాంగ్రెస్ బలానికి, అధికారంలోకి వస్తుందన్న సంకేతాలకు నిదర్శమన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాకా అందరికి సముచితం స్థానం లభిస్తుందన్నారు.