రేవంత్ పాద‌యాత్ర‌.. పార్టీలో పెరుగుతున్న మ‌ద్ద‌తు

రేవంత్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంద‌న్న భ‌ద్రాద్రి ఎమ్మెల్యే పోడెం వీర‌య్య‌ విధాత‌: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు పెరుగుతుందా? అంటే పెరుగుతుంద‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా నిరంతం విమ‌ర్శ‌లు చేసే నేత‌లు ఏ ఒక్క‌రు కూడ ఆయ‌న పాద‌యాత్ర‌పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. తాజాగా భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోడెం వీర‌య్య చేసిన కామెంట్ రేవంత్ పాద‌యాత్ర‌కు కాంగ్రెస్ పార్టీలో మ‌ద్ద‌తు పెరుగుతుంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వెలువ‌డుతోంది. […]

రేవంత్ పాద‌యాత్ర‌.. పార్టీలో పెరుగుతున్న మ‌ద్ద‌తు
  • రేవంత్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంద‌న్న భ‌ద్రాద్రి ఎమ్మెల్యే పోడెం వీర‌య్య‌

విధాత‌: కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు పెరుగుతుందా? అంటే పెరుగుతుంద‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా నిరంతం విమ‌ర్శ‌లు చేసే నేత‌లు ఏ ఒక్క‌రు కూడ ఆయ‌న పాద‌యాత్ర‌పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. తాజాగా భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోడెం వీర‌య్య చేసిన కామెంట్ రేవంత్ పాద‌యాత్ర‌కు కాంగ్రెస్ పార్టీలో మ‌ద్ద‌తు పెరుగుతుంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వెలువ‌డుతోంది.

భ‌ద్రాచ‌లం ఎమ్మెల్ల్యే పోడెం వీర‌య్య పిన‌పాక‌లో మాట్లాడుతూ.. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పాద‌యాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమ‌ని, ఇందిర‌మ్మ రాజ్యం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. పోడెం వీర‌య్య చేసిన ఈ ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ పార్టీలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని అర్థ‌మ‌వుతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అనేక ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 6వ తేదీన ములుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొద‌లు పెట్టారు. పూర్తిగా అట‌వీ ప్రాంత‌మైన ములుగు, న‌ర్సంపేట‌, మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్‌, ఇల్లందు, భ‌ద్రాచ‌లం, పిన‌పాక త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌లో జ‌రుగుత‌న్న‌ది. రేవంత్‌కు దారి పొడ‌వునా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు.

ఇది పార్టీ శ్రేణులో మంచి ఉత్సాహాన్ని క‌లిగించింది. దారిలో రైతులు, విద్యార్థులు, వృద్దులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, కార్మికులు ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ, వారి స‌మ‌స్య‌లు ఓపిక‌గా వింటూ, భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు వెళుతున్నారు. 2024లో వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వమేన‌ని న‌మ్మ‌కంగా చెపుతూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

రేవంత్ పాద‌యాత్ర విజ‌య‌వంతం అవుతుండ‌డంతో క్యాడ‌ర్‌లో భ‌రోసా క‌లిగింది. దీంతో రేవంత్‌పై చీటికి మాటికి విమ‌ర్శ‌లు చేసే నేత‌లు కూడ సైలెంట్ అయ్యారు. అలాగే ఈ పాద‌యాత్ర విజ‌య‌వంతం చేయాల‌ని, దీనిపైనే పార్టీ భ‌విష్య‌త్ ఆధారప‌డి ఉంద‌ని రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్యం ఠాక్రే నేత‌ల‌కు స్ప‌ష్టం చేశారు.

దీంతో పార్టీ సీనియ‌ర్లు, రేవంత్‌ను వ్య‌తిరేకించే నేత‌లంతా ముందుగా అధిష్టానం ఆదేశాల మేర‌కు సైలెంట్ అయ్యారు. అయితే వారం రోజులుగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి, పార్టీ నేత‌ల నుంచి మ‌ద్ద‌తుగా రావ‌డంతో నిత్యం విమ‌ర్శ‌లు చేసే నేత‌లు సైలెంట్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడ‌ర్ నుంచి రేవంత్‌కు మ‌ద్ద‌తు పెరుగుతున్న‌ది.

రేవంత్‌రెడ్డి అన్ని నియోజ‌వ‌ర్గాల‌లో పాద‌యాత్ర చేస్తే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ‌స్తుందంటూ భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోడెం వీర‌య్య చేసిన ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితికి అద్దం ప‌డుతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.