కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభం.. ఓటు వేసిన రాహుల్, సోనియాగాంధి

విధాత: కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల‌లో 9 వేల‌కు పైగా పీసీసీ ప్ర‌తినిధులు ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో 24 ఏళ్ల త‌ర్వాత గాంధీ యేత‌ర వ్య‌క్తి ఐఏసీసీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాల‌యాల‌తో పాటు, ఢిల్లీలోని ఐఏసీసీ కార్యాల‌యంలోనూ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ […]

  • By: krs    latest    Oct 17, 2022 7:44 AM IST
కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభం.. ఓటు వేసిన రాహుల్, సోనియాగాంధి

విధాత: కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల‌లో 9 వేల‌కు పైగా పీసీసీ ప్ర‌తినిధులు ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో 24 ఏళ్ల త‌ర్వాత గాంధీ యేత‌ర వ్య‌క్తి ఐఏసీసీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు.

అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాల‌యాల‌తో పాటు, ఢిల్లీలోని ఐఏసీసీ కార్యాల‌యంలోనూ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ స‌హా 75 మంది నేత‌లు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర క్యాంప్‌లోనూ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. రాహుల్ క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారిలో ఓటు వేశారు. అధ్య‌క్ష ఎన్నిక సంద‌ర్భంగా ఇవాళ యాత్ర‌కు విరామం ఇచ్చారు.

బ‌రిలో ఉన్న థ‌రూర్ తిరువ‌నంత‌పురంలోని పార్టీ ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే బెంగ‌ళూరులోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఓటు వేశారు. ర‌హ‌స్య బాలెట్ ద్వారా జ‌ర‌గుతున్న ఓటింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ది. ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు ఈ నెల 19న వెలువడుతాయి.

ఇదిలాఉండగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పొన్నాల ల‌క్ష్మ‌య్య గాంధీభ‌వ‌న్ మెట్ల‌పై బైఠాయించారు. ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేస‌కున్నాయంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఓట‌ర్ల జాబితాలో గంద‌ర‌గోళానికి కార‌ణ‌మేంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.