Minister Harish Rao | కాంగ్రెస్‌ది సీజనల్ ప్రేమ.. కేసీఆర్‌ది శాశ్వత ప్రేమ: మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ది సీజనల్ ప్రేమ.. కానీ కేసీఆర్ ది శాశ్వత ప్రేమ అని మంత్రి హరీశ్‌రావు చమత్కరించారు. మెదక్ జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టి సింగూర్ నీళ్ళను హైదరాబాద్ కు తీసుకెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనీ మండిపడ్డారు. తెలంగాణ సాధనకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమ ఆపార్టీ నాయకులకు ఉండదన్నారు. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ నియోజకవర్గం పుల్కల్ […]

విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ది సీజనల్ ప్రేమ.. కానీ కేసీఆర్ ది శాశ్వత ప్రేమ అని మంత్రి హరీశ్‌రావు చమత్కరించారు. మెదక్ జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టి సింగూర్ నీళ్ళను హైదరాబాద్ కు తీసుకెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనీ మండిపడ్డారు. తెలంగాణ సాధనకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమ ఆపార్టీ నాయకులకు ఉండదన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆంథోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి.. సింగూరు ప్రాజెక్టులో 60 వేల చేప పిల్లలను, రొయ్యలు వదిలారు. సింగూరు కెనాల్ కాలువపై బస్వాపూర్ వద్ద వంతెన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బస్వాపూర్ లో 300 దివ్యాంగులకు నూతనంగా పెరిగిన పెన్షన్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, జీవో 58, 59 లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.
నిన్ననే మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం, ఈ రోజు ఆసియాలోనే అతి పెద్దదైన పాలమూరు రంగారెడ్డిఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారనీ అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో వృద్ధులు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం చేతగాని కాంగ్రెస్, ఇక్కడ 5 వేల పింఛన్ ఇస్తానంటే ఎవరు నమ్మే వాళ్ళు లేరనీ దుయ్యబట్టారు.
ఇప్పటివరకు రైతులకు 72 వేల కోట్ల రూపాయల రైతుబంధు సహాయం అందించామనా్నరు. సీడబ్ల్యుసీ మీటింగ్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు చేస్తున్నదని, ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రకటించారు.
తెలంగాణ ప్రజలను గ్యారంటీల పేరిట మోసం చేయడం కుదరదని, తెలంగాణ కు పర్మినెంటు గ్యారంటీ కేసీఆర్ మాత్రమే నని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.