దేశంలో ఏకైక అవినీతి కుటుంబం.. కల్వకుంట్లదే: కిషన్‌రెడ్డి
విధాత: సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రధాని మోడీని నిందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ దేశంలో అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల కుటుంబమే అన్నారు. వాళ్లకే నెంబర్ వన్ స్థానం వస్తుందన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, నేను బాధ్యత గలిగిన కేంద్ర మంత్రిగా చెబుతున్నాను మోటర్లకు మీటర్లు అవసరం లేదు. పెట్టాలా […]

విధాత: సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రధాని మోడీని నిందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ దేశంలో అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల కుటుంబమే అన్నారు. వాళ్లకే నెంబర్ వన్ స్థానం వస్తుందన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, నేను బాధ్యత గలిగిన కేంద్ర మంత్రిగా చెబుతున్నాను మోటర్లకు మీటర్లు అవసరం లేదు. పెట్టాలా వద్దా అన్నది మీరు నిర్ణయించండి. రైతులకు ఏవైనా ఉచితాలు ఇవ్వాలంటే మీరు ఇవ్వండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కానీ మీటర్లు పెట్టమంటున్నారని ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారని కిషన్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి ఉన్నదని, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను భయపెట్టి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు చేసింది విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నాం తప్పా మీటర్లకు మోటర్లు అని మేము అనడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల వ్యవసాయ బడ్జెట్ పెట్టిందని.. మీలాగా పేపర్ మీద పెట్టే బడ్జెట్ పెట్ట లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి అమలు గాడీ తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు స్థలాలు, పొలాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.