కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు
ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రైతుల ఆవేదన ఉదయం నిరంతరంగా కరెంటు ఇస్తేనే మేలు రాత్రి పూట ఇస్తే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్న అన్నదాతలు విధాత: దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అధికారపార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం, రెప్పపాటు కరెంటు కోతలు కూడా లేవు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా […]

- ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రైతుల ఆవేదన
- ఉదయం నిరంతరంగా కరెంటు ఇస్తేనే మేలు
- రాత్రి పూట ఇస్తే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్న అన్నదాతలు
విధాత: దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అధికారపార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం, రెప్పపాటు కరెంటు కోతలు కూడా లేవు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయి.
కరెంటు కోతలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అపరిమిత కోతలతో ఏమి చేయాలో తెలియక పరిస్థితి నెలకొన్నది. సమయపాలన లేని విద్యుత్ సరఫరాతో పొలాల వద్దే అన్నదాతలు పడిగాపులు కాసే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు వారబందీ పద్ధతితో నీళ్లు ఇస్తుండటంతో పొలాలు పూర్తిగా తడవక ఎండిపోతున్నాయి.
బోర్ల ద్వారా అయినా పంటలను కాపాడుకుందామంటే కరెంటు కష్టాలతో సాధ్యపడటం లేదని, పొట్ట దశలో నీళ్లు అందక పంటల ఎండుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం ఒక రోజులో పారాల్సింది కరెంటు కోతలతో నాలుగు రోజులు పడుతున్నదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పరకాలలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు.
కానీ అదేమీ లేదని రైతులు అంటున్నారు. ఉదయం పూట కరెంటు ఇవ్వాలని, రాత్రి పూట ఇస్తే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఆరు గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తేనే పంటలు పండుతాయని, లేకపోతే ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుదని రైతులు వాపోతున్నారు.