Dangerous: మళ్లీ మెగా ఫ్యామిలీని కెలికిన వర్మ

విధాత‌: భారతీయ సినీ చరిత్రలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘శివ’ చిత్రం కచ్చితంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సంగీతం పరంగా ‘శంకరాభరణం’ ఎంత పెద్ద హిట్టో.. ఎలాంటి ట్రెండ్ సెట్టరో.. ‘శివ’ చిత్రం కూడా అదే కోవకు వస్తుంది. ‘శివ’ విడుదలైన తరువాత తెలుగు సినీ చరిత్రను శివ ముందు శివ తర్వాత అని విభజించుకోవచ్చు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం పెద్దగా లేకపోయినా.. ఆయనకంటూ గొప్ప విజన్ ఉండేది. […]

  • By: krs    latest    Dec 08, 2022 9:05 AM IST
Dangerous: మళ్లీ మెగా ఫ్యామిలీని కెలికిన వర్మ

విధాత‌: భారతీయ సినీ చరిత్రలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘శివ’ చిత్రం కచ్చితంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సంగీతం పరంగా ‘శంకరాభరణం’ ఎంత పెద్ద హిట్టో.. ఎలాంటి ట్రెండ్ సెట్టరో.. ‘శివ’ చిత్రం కూడా అదే కోవకు వస్తుంది. ‘శివ’ విడుదలైన తరువాత తెలుగు సినీ చరిత్రను శివ ముందు శివ తర్వాత అని విభజించుకోవచ్చు.

ముఖ్యంగా రాంగోపాల్ వర్మకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం పెద్దగా లేకపోయినా.. ఆయనకంటూ గొప్ప విజన్ ఉండేది. ఆయన సినీ దర్శకునిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే తెలుగు సినిమాలు సాంకేతికంగా మంచి స్థాయిని పొందాయి. అవి రాను రాను ఏకంగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో తమకంటూ ఒక మంచి సాంకేతిక విలువలను సృష్టించాయి.

వాస్తవంగా చెప్పాలంటే నేటి డైరెక్టర్‌లందరూ తమ చిన్న వయసులో, యుక్తవయసులో చిరంజీవికి అభిమానులుగా కచ్చితంగా ఉంటారు. అలాగే రాంగోపాల్ వర్మ కూడా దానికి మినహాయింపు కాదు. ఆయన మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని చాలా కష్టపడ్డారు. చిరంజీవి హీరోగా అశ్విని‌దత్ నిర్మాతగా తన దర్శకత్వంలో ఒక చిత్రం ఆరంభించారు కూడా. కారణాలు తెలియవు కానీ ఆ మూవీ మూలన పడింది. ఇక ఇలా సాగుతున్న వర్మ జీవితం ఒకానొక దశలో విచిత్ర రూపం దాల్చింది.

శివ, క్షణక్షణం, మనీ, అనగనగా ఒక రోజు.. బాలీవుడ్‌లో రంగీలా, సత్య, కంపెనీ, బూత్ వంటి పలు చిత్రాలను తీశారు. అంతే కాదు ఏకంగా అమితాబచ్చన్, అనిల్ కపూర్ వంటి వారి దృష్టిలో కూడా పడ్డాడు. బాలీవుడ్ సినీ రంగమే మాఫియా అండర్ కవర్ పోలీస్ వంటి చిత్రాలను వాస్తవికంగా తీయలేని పరిస్థితులలో.. వర్మ మాత్రం ఏ మాత్రం జంకు బంకు లేకుండా వరుస పెట్టి చిత్రాలు తీశారు.

దావూద్ ఇబ్రహీం, శివసేన అధినేత బాల్ థాకరేలను స్పూర్తిగా తీసుకొని చిత్రాలు చేశాడు. అయితే ఎందుకనో ఆ తరువాత ఆయన చాలా కాలం తెలుగు పరిశ్రమ వైపు తిరిగి చూడలేదు. దానికి తోడు హిందీలో తీసిన డిజాస్టర్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి ఉన్న పేరు చెడగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి చిత్రం వివాదమే అయ్యింది. దీంతో ఆయన కాంట్రవర్సీ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఇలాంటి సీక్రెట్ చిత్రాలు, తన ట్వీట్స్, సోషల్ మీడియాను వాడుతున్న విధానం, తన వ్యక్తిగత జీవితం.. ఇలా పలు అలవాట్లతో ఆయన గొప్ప దర్శకుడుగా కాక.. జస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్‌గా మాత్రమే పేరు తెచ్చుకున్నాడు. ఇక విషయానికొస్తే.. వర్మ చిరంజీవి కాంబినేషన్‌లో క్షణక్షణం తర్వాత ఓ చిత్రం షూటింగ్ జరిగి ఆగిపోయింది. నాటి నుండి మెగా హీరోలు, మెగా ఫ్యామిలీపై వర్మ తరచూ సెటైర్స్ వేస్తుంటాడని చాలామంది అభిప్రాయం.

ఇదే విషయంపై తాజాగా వర్మ తనదైన కోణంలో విశ్లేషించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి రీఎంట్రీగా ‘ఖైదీ నెంబర్ 150’ అనే సినిమాతో మరోసారి సినీ దండయాత్ర ప్రారంభించాడు. ఆ చిత్రాన్ని అందునా చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రాన్ని తమిళ్ రీమేక్ గా తీయడం సాదాసీదా కథాంశం, ఏదో చిన్న స్థాయి హీరోకి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించడం వంటివి వర్మను బాధించాయట.

దీనిపై వర్మ మాట్లాడుతూ.. నేను చిరంజీవి ఫ్యామిలీ గురించి ఎప్పుడూ సెటైర్స్ వేయలేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా విషయంలో కూడా ఒక అభిమానిగా చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇలాంటి చిన్న చిత్రాలలో నటించడం ఏంటి?.. బాహుబలి వంటి సినిమాలో నటిస్తే బాగుండు అన్నాను. నేను మాట్లాడిన మాటల్లో నాకైతే ఎక్కడ సెటైర్ కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కల్యాణ్ అంటే కూడా తనకు అదే గౌరవం ఉంటుందని వర్మ తన ఇంటర్వ్యూలో తెలిపారు. అయినా వర్మకి ఇవన్నీ అలవాటే. తన సినిమా ఏదైనా విడుదల ఉందంటే.. ఏదో రకంగా మెగా ఫ్యామిలీని కెలకడం అలవాటే. ఇప్పుడు ‘డేంజరస్’ సినిమా విడుదల కాబోతుండటంతో.. ఇలా మెగా హీరోల భజన మొదలెట్టాడని.. ఆయన ఇంటర్వ్యూ చూసిన వారంతా అనుకుంటుండటం గమనార్హం.