బాన్సువాడలో పట్టపగలు చోరీ!
విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ దుకాణంలో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల జూనియర్ కాలేజ్ దుకాణ సముదాయంలో వీరభద్ర కన్ఫెక్షనరీ షాప్ షట్టర్ తెరిచి బ్యాగ్ ఎత్తు కెళ్లగా అందులో 50 వేల రూపాయలు చోరికి గురయ్యాయి. పట్టణానికి చెందిన కోటి ప్రవీణ్ అనే వ్యాపారస్తుడు ఉదయం దుకాణం తెరిచి పని మీద షట్టర్ మూసివేసి బయటకు వెళ్లడంతో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు షట్టర్ […]

విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ దుకాణంలో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల జూనియర్ కాలేజ్ దుకాణ సముదాయంలో వీరభద్ర కన్ఫెక్షనరీ షాప్ షట్టర్ తెరిచి బ్యాగ్ ఎత్తు కెళ్లగా అందులో 50 వేల రూపాయలు చోరికి గురయ్యాయి.
పట్టణానికి చెందిన కోటి ప్రవీణ్ అనే వ్యాపారస్తుడు ఉదయం దుకాణం తెరిచి పని మీద షట్టర్ మూసివేసి బయటకు వెళ్లడంతో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు షట్టర్ తెరిచి అందులోని బ్యాగ్ ఎత్తుకెళ్లారు.
ఎదురుగా ఉన్న పండ్ల దుకాణం వ్యాపారి వారిని గమనించి వెంబడించి నప్పటికీ దుండగులను పట్టుకోలేక పోయారు.కాగా కోటి ప్రవీణ్ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచే రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం చోరికి పాల్పడినట్లు తెలుస్తోంది.