దీపికా ‘అందాలకు’ బ్రేక్.. సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం
విధాత: షారుక్ ఖాన్- దీపికా పడుకొనే- జాన్ అబ్రహం నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్’. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ మూవీ చిక్కుల్లో పడింది. ఇందులోని పలు సన్నివేశాలు, సాంగ్స్ లోని కొన్ని విజువల్స్ పై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. వాటిని తొలగించాలని లేకపోతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పిందని అంటున్నారు. […]

విధాత: షారుక్ ఖాన్- దీపికా పడుకొనే- జాన్ అబ్రహం నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్’. ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సెన్సార్ బోర్డ్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ మూవీ చిక్కుల్లో పడింది. ఇందులోని పలు సన్నివేశాలు, సాంగ్స్ లోని కొన్ని విజువల్స్ పై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.
వాటిని తొలగించాలని లేకపోతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పిందని అంటున్నారు. తాము చెప్పిన విధంగా మార్పులు చేస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని ఆదేశించారు. దీంతో ‘పఠాన్’ టీమ్ సెన్సార్ బోర్డు అభ్యంతరాలకు అనుగుణంగా సన్నివేశాలలో మార్పులు చేసి మరలా రీషూట్ చేసే పనిలో పడింది.
‘జీరో’ సినిమా తర్వాత షారుక్ నటిస్తున్న చిత్రమిది. షారుక్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తుండగా జాన్ అబ్రహం విలన్‌గా నటిస్తున్నాడు. సిద్ధార్థ ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు విడుదలయ్యాయి. దీనిలో ముఖ్యంగా బేషరం…. అనే సాంగ్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల నుంచి నెటిజన్ల వరకు ఇందులో దీపికా పడుకొనే వేసుకున్న దుస్తులు, బికినీ, అందులో ఆ బికినీ కాషాయం రంగులో ఉండడం, దీపికా పడుకొనే అంగంగాలపై షారుక్ చేతులు వేసి మరి డాన్స్ చేయడం వంటి వాటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దాంతో ఏకంగా ఈ సినిమాను నిషేధించాలని ఉద్యమాలు కూడా జరిగాయి.
మొత్తానికి ఏదో కొన్ని మార్పులతో ఈ చిత్రానికి సెన్సార్ లభించే అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల షారుఖ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇది ఈ చిత్రానికి కాస్త మైనస్ అనుకున్నప్పటికీ ఈ వివాదం ద్వారా ఉచితంగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రమోషన్ లభించడం తమ మూవీకి ప్లస్ పాయింట్ గా నిర్మాతలు భావిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రం సెన్సార్ వెనుక కేంద్రంలోని బిజిపె పెద్దల ప్రమేయం ఉందని షారుఖ్ అభిమానులు అంటుండగా, హిట్లు లేక షారుఖ్ ఇలా దిగజారాడని, ఈ దేశ సంప్రదాయాలను మంటకలపడం వెనుక పలు ఇస్లామిక్ శక్తులు ఉన్నాయని.. బిజెపి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండడం విశేషం.