23 తర్వాత ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ అసమ్మతి నేతలకు ఢిల్లీ హైకమాండ్ ఆదేశం
23 తర్వాత హస్తినకు… విధాత: టి. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు లేవనెత్తిన అసమ్మతిపై కాంగ్రెస్ ఢిల్లీ హై కమాండ్ ఎట్టకేలకు ఫోకస్ పెట్టింది. సోమవారం ప్రియాంక గాంధీ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అసమ్మతి అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాకా, ఈ నెల 23 తర్వాత ఢిల్లీకి రావాలని సూచించారు. ఈ మేరకు పిసి వేణుగోపాల్ సైతం కాంగ్రెస్ సీనియర్లకు పలువురికి ఫోన్ […]

- 23 తర్వాత హస్తినకు…
విధాత: టి. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు లేవనెత్తిన అసమ్మతిపై కాంగ్రెస్ ఢిల్లీ హై కమాండ్ ఎట్టకేలకు ఫోకస్ పెట్టింది. సోమవారం ప్రియాంక గాంధీ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అసమ్మతి అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాకా, ఈ నెల 23 తర్వాత ఢిల్లీకి రావాలని సూచించారు.
ఈ మేరకు పిసి వేణుగోపాల్ సైతం కాంగ్రెస్ సీనియర్లకు పలువురికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ షాను అసమ్మతివాదులతో చర్చించాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగుర్ చెప్పారు.
అయితే నదీమ్ షాతో మాట్లాడేందుకు ఇష్టపడని సీనియర్లు హై కమాండ్ పెద్దలతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు. దీంతో వేణుగోపాల్, ప్రియాంకతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు టీ. కాంగ్రెస్ లోని రెండు వర్గాలను కూడా 23 తర్వాత ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.