భూదందాకు రూపకర్త, సృష్టికర్త కేసీఆరే: ఈటల
విధాత: భూమి ప్రక్షాళన అంటూ ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భూదందాకు రూపకర్త, సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరే. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లపై , భూమి క్రయ, విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రజలను వేధించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. దేశంలో భూములన్నీఎన్ఐసీలో భద్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు సంస్థలు మార్చారు. భూమి సమస్యల […]

విధాత: భూమి ప్రక్షాళన అంటూ ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. భూదందాకు రూపకర్త, సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆరే. ధరణిలో నమోదైన భూముల రిజిస్ట్రేషన్లపై , భూమి క్రయ, విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
ప్రజలను వేధించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. దేశంలో భూములన్నీఎన్ఐసీలో భద్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు సంస్థలు మార్చారు. భూమి సమస్యల వల్లనే అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. భూమి సమస్యలతో రైతులు న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారని ఈటల అన్నారు.