వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా: చంద్రమోహన్

ఆస్తులన్నీ అమ్మేసి.. ఇప్పుడు బాధ విధాత: ధారణంగా మన పెద్దలు చెప్పేది ఏందంటే దక్కాల్సింది ఎవరు అడ్డు పడినా దక్కుతుంది.. దక్కనిది మాత్రం ఎవరు ఎంతగా ప్రయత్నించినా దక్కదు అంటారు. హీరో, నటుడు చంద్రమోహన్ గురించి రెండు మూడు తరాలుగా ప్రేక్షకులందరికీ బాగా తెలుసు పొట్టి వాడు మహా గట్టివాడు అంటారు. ఆ విషయం చంద్రమోహన్ విషయంలో నిజమైంది. ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు ఆయన నటన ప్రతిభ చూసి ఎస్వీ రంగారావుతో పాటు ఎందరో సీనియర్ […]

  • By: krs    latest    Dec 19, 2022 1:12 PM IST
వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా: చంద్రమోహన్

ఆస్తులన్నీ అమ్మేసి.. ఇప్పుడు బాధ

విధాత: ధారణంగా మన పెద్దలు చెప్పేది ఏందంటే దక్కాల్సింది ఎవరు అడ్డు పడినా దక్కుతుంది.. దక్కనిది మాత్రం ఎవరు ఎంతగా ప్రయత్నించినా దక్కదు అంటారు. హీరో, నటుడు చంద్రమోహన్ గురించి రెండు మూడు తరాలుగా ప్రేక్షకులందరికీ బాగా తెలుసు పొట్టి వాడు మహా గట్టివాడు అంటారు. ఆ విషయం చంద్రమోహన్ విషయంలో నిజమైంది. ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు ఆయన నటన ప్రతిభ చూసి ఎస్వీ రంగారావుతో పాటు ఎందరో సీనియర్ నటులు.. నువ్వు 5 అడుగులు కాకుండా ఆరడుగులు ఉంటే ఇండస్ట్రీని ఊపుసేవాడివి.. ఎన్టీఆర్ ఏఎన్నార్లకు చుక్కలు కనిపించేవి అని కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు.

1966లో ఆయన రంగులరాట్నం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే ఉంటూ లెజెండరీ స్థానాన్ని సొంతం చేసుకున్న అతికొద్దిమందిలో ఆయన ఒకరు. హీరోగా, కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా బహుముఖ పాత్రలు పోషించి.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ట్రాక్ రికార్డ్‌ని సృష్టించారు. మధ్యలో కొన్ని చిత్రాలలో ఈయన విలన్‌గా కూడా నటించాడు. దాదాపు 900కి పైగా చిత్రాల్లో నటించినా ఈయన 175 చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లకు లక్కీ హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నాడు.

సిరిసిరిమువ్వ చిత్రంలో ఆయన సరసన జయప్రద, 16 ఏళ్ల వయసు చిత్రంలో శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక విజయశాంతి, భానుప్రియ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు ఆయన పక్కన నటించిన వారే. వారే ఆ తర్వాతి కాలంలో తిరుగులేని హీరోయిన్లుగా ఎదిగారు. మొత్తంగా 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్ కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రముఖ రచయిత్రి జలంధరతో పాటు ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. చంద్రమోహన్‌ను చాలా మంది లక్కీగా భావిస్తారు. ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసి వస్తుందని నమ్ముతారు. ఇప్పటికీ జనవరి ఒకటో తేదీన ఎంతోమంది వచ్చి ఆయన చేత్తో డబ్బులు తీసుకొని వెళ్తారు అని చెప్పుకొచ్చింది. భార్య మాటలు వినగానే మన చంద్రమోహన్‌కు భావోద్వేగం కలిగింది. కన్నీళ్లు పెట్టుకుంటూ శోభన్ బాబు ఎంత చెప్పినా వినకుండా.. వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.

అప్పట్లో కొంపల్లి వద్ద గొల్లపూడి మారుతీరావు ద్రాక్ష తోట తీసుకున్నాడు. ఆయన సలహాతో నేను కూడా 30 ఎకరాలు 35 ఎకరాలు కొన్నాను కానీ దాని మేనేజ్ చేయలేక అమ్మేశాను. నాడు కొంపల్లి ప్రాంతంలో రౌడీయిజం ఎక్కువగా ఉండేది. కబ్జాలు జరుగుతూ ఉండేవి. నా ద్రాక్ష తోట మీద వారి కన్ను పడింది అది కబ్జాకి గురి అవ్వడం ఇష్టం లేక అమ్మేశాను. శోభన్ బాబు గారు భవిష్యత్తులో అవి కోట్ల విలువ చేస్తాయి అమ్మవద్దు అని ఎంత చెప్పినా వినకుండా అమ్మేశాను. ఇప్పుడు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది.. వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది అని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు చెప్తున్నా వినకుండా మద్రాస్‌లో 15 ఎకరాలు అమ్మేశాను. ఆ భూమి విలువ 30 కోట్లు ఉంటుంది. అంతేగాక హైదరాబాద్లోని శంషాబాద్ మెయిన్ రోడ్డు పక్కనే ఆరు ఎకరాల పొలం కొన్నాను.. అది కూడా అమ్మేశాను. ఇప్పుడు అదే ప్రాంతంలో మంచి మంచి రిసార్ట్స్ పెట్టారు అలా నేను అజాగ్రత్తతో వందల కోట్లు పోగొట్టుకున్నాను. నా జీవితంలో సంపాదించిన వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ. నాకు అనేక చోట్ల ఇల్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

కానీ అదేమీ నిజం కాదు. 20% నిజం ఉంటే దాన్ని మీడియా వారు 100% సృష్టిస్తూ ఉంటారు అని వాపోయాడు. నాకు ఇద్దరు కూతుర్లే కావడం వల్ల అందులోనూ వాళ్ళు కూడా విదేశాల్లో స్థిరపడటం వల్ల.. ఆస్తులను చూసుకోవడం కష్టం అయ్యేదని భావించి కొన్ని ఆస్తులను తక్కువ ధరకు అమ్మేసుకున్నాను. నాకు అబ్బాయిలు ఉన్నా లేదంటే నా కూతుర్లు తమ ఫ్యామిలీతో కలిసి ఇండియాలో ఉన్నా ఆ భూములను అమ్మే ఆలోచన నాకు వచ్చేది కాదని ఆయన ఎమోషనల్‌గా చెప్పుకుంటూ వచ్చారు.

ఇక చంద్రమోహన్ విషయానికి వస్తే ఆయన అన్ని కోట్లు సంపాదించడానికి కారణం శోభన్ బాబు.. ఆయనే కాదు శోభన్ బాబు మాట విని బాగుపడిన వారు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యులు మురళీమోహన్. నేడు జయభేరి సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో ఓ వెలుగు వెలుగుతోందంటే దానికి శోభన్ బాబు గారు ఇచ్చిన సలహానే కారణం.

శోభన్ బాబు నాడు తన దగ్గరకు వచ్చిన వారందరికీ భూముల మీద పెట్టుబడి పెట్టండి.. విశ్వంలో మనుష్య జనాభా పెరుగుతూ ఉంటుందే గాని నివాస యోగ్యమైన భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది.. కాబట్టి భూములకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. కాబట్టి భావి అవసరాలకు ముందుచూపుతో భూములపై పెట్టుబడి పెట్టండి అని చెప్పేవాడు. చెప్పడమే కాదు తాను అదే చేసి చూపించాడు. ఒక చిత్రంలో అన్నట్టు భూమిని, మట్టిని నమ్ముకున్న వాడికి ఆ మట్టి అన్నం పెడుతుంది అదే మనిషిని నమ్ముకుంటే నోట్లో మట్టి కొడతాడు అని చెప్పిన డైలాగ్ కచ్చితంగా వందకి వెయ్యి శాతం నిజం.

అయితే చంద్రమోహన్‌పై ఓ అపవాదు ఉంది.. చంద్రమోహన్‌లా సంపాదించుగానీ చంద్రమోహన్‌లా జీవించకు అని ఒక నానుడి. ఇండస్ట్రీలో.. ఆయన షూటింగ్ సమయంలో భోజనంతో పాటు అన్ని అవసరాలను అన్ని కోరికలను నిర్మాత డబ్బుతో తీర్చుకునేవాడు కానీ.. తన సొంత విషయానికి వచ్చేటప్పటికి పిసినారిగా కనిపించేవాడని చాలామంది అంటారు. చంద్రమోహన్.. కే విశ్వనాథ్‌తో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా దగ్గర బంధువు.