బీటీ రోడ్డు విధ్వంసం.. మెగా కంపనీ వాహనాలను అడ్డగించిన కాంగ్రెస్

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ- పులిగిల్ల బీటీ రోడ్డు మెగా గ్యాస్ కంపెనీ భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే పలు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్ కంపెనీల వాహనాలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూతి రమేష్, నాయకులు యుగేందర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రజల పన్నులతో, […]

  • By: krs    latest    Feb 10, 2023 11:21 AM IST
బీటీ రోడ్డు విధ్వంసం.. మెగా కంపనీ వాహనాలను అడ్డగించిన కాంగ్రెస్

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ- పులిగిల్ల బీటీ రోడ్డు మెగా గ్యాస్ కంపెనీ భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే పలు గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్ కంపెనీల వాహనాలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీపీ నూతి రమేష్, నాయకులు యుగేందర్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రజల పన్నులతో, ప్రజాధనంతో ప్రభుత్వం వేసిన రోడ్డును మెగా కంపెనీ తన వాహనాల రాకపోకలు వినియోగించుకుంటూ కూడా దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులకు ముందుకు రాకపోవడం అన్యాయంగా ఉందన్నారు.

ప్రయాణానికి వీలు లేకుండా పూర్తిగా బీటీ, కంకర కొట్టుకుపోయి, గుంతలతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును వెంటనే పునర్మించేందుకు కంపెనీ లేదా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఎమ్మెల్యే స్వగ్రామానికి వెళ్లే వలిగొండ -చాడా బీటీ రోడ్డు కూడా గతుకులమై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, ఆ రోడ్డును కూడా ఎమ్మెల్యే పైళ్ల నిధులు మంజూరు చేసి మరమ్మత్తు జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి నాయకులు గరిసే రవి, కంకణాల కిష్టయ్య ,పల్సమ్ సతీష్, కాసుల వెంకటేష్, కొండూరు సాయి, శనిగారపు పాండు ,మైసోళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.