‘దేవ‌ర యంజాల్’ భూములు స్వాధీనం చేసుకోవాలి

ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన విచార‌ణ క‌మిటీ విధాత: దేవ‌ర యంజాల్ సీతారామ‌చంద్ర స్వామి దేవాల‌య భూముల్లో జ‌రిగిన క‌బ్జాల‌ను తొల‌గించి, ఆ భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని విచార‌ణ క‌మిటీ త‌న నివేదిక‌లో తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విచార‌ణ క‌మిటీ మేడ్చల్ జిల్లాలోని దేవరయంజాల్ సీతా రామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాకు సంబంధించి నివేదిక‌ను సమర్పించింది. ఈ క‌మిటీ భూ క‌బ్జాల‌పై సమగ్ర విచారణ జ‌రిపి ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక ప్రకారం మొత్తం 1350 […]

  • By: krs    latest    Nov 15, 2022 12:53 PM IST
‘దేవ‌ర యంజాల్’ భూములు స్వాధీనం చేసుకోవాలి

ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన విచార‌ణ క‌మిటీ

విధాత: దేవ‌ర యంజాల్ సీతారామ‌చంద్ర స్వామి దేవాల‌య భూముల్లో జ‌రిగిన క‌బ్జాల‌ను తొల‌గించి, ఆ భూముల‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని విచార‌ణ క‌మిటీ త‌న నివేదిక‌లో తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విచార‌ణ క‌మిటీ మేడ్చల్ జిల్లాలోని దేవరయంజాల్ సీతా రామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాకు సంబంధించి నివేదిక‌ను సమర్పించింది.

ఈ క‌మిటీ భూ క‌బ్జాల‌పై సమగ్ర విచారణ జ‌రిపి ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక ప్రకారం మొత్తం 1350 ఎకరాల భూములు దేవాలయానికి సంబంధించినవేనని కమిటీ తెలిపింది. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, చాలా వ‌ర‌కు భూములు కబ్జాలకు గుర‌య్యాయ‌ని పేర్కొన్న‌ది.

క‌బ్జాలు, ఆక్ర‌మ‌ణ‌లు, అక్ర‌మ నిర్మాణాల‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్ట‌డంతో పాటు, తిరిగి ఆ భూములను స్వాధీన పరుచుకుని దేవాలయానికి అప్ప‌జెప్పాల‌ని క‌మిటీ రిపోర్టు ఇచ్చింది.