బిల్లులు రాక.. దేవరకొండ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

విధాత: గ్రామ పంచాయతీ తరపున చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆ పనుల కోసం చేసిన అప్పులు పెరిగి పోతుండడంతో ఆందోళనకు గురైన దేవరకొండ మండలం చింతబావి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గ్రామ సర్పంచ్ నోముల మల్లేష్ గ్రామాభివృద్ధికి అప్పు తెచ్చి మరి ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయించారు. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఏడాది గడిచిపోయిన ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చినవారి […]

బిల్లులు రాక.. దేవరకొండ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

విధాత: గ్రామ పంచాయతీ తరపున చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆ పనుల కోసం చేసిన అప్పులు పెరిగి పోతుండడంతో ఆందోళనకు గురైన దేవరకొండ మండలం చింతబావి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

గ్రామ సర్పంచ్ నోముల మల్లేష్ గ్రామాభివృద్ధికి అప్పు తెచ్చి మరి ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయించారు. వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఏడాది గడిచిపోయిన ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చినవారి నుంచి సర్పంచ్ మల్లేష్‌పై ఒత్తిడి పెరిగింది.

ఇటు బిల్లులు రాక అటు అప్పుల వారి ఒత్తిడి భరించలేక ఏం చేయాలో పాలు పోనీ సర్పంచ్ మల్లేష్ సోమవారం రాత్రి తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు గ్రామస్తులు వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

సర్పంచ్ మల్లేశంకి ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహలు ఆసుపత్రికి వెళ్లి మల్లేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.