యాదాద్రికి పోటెత్తిన భక్తులు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని పూజ‌లు చేశారు. ఆదివారం సెలవు రోజు కావ‌డంతో భక్తులు భారీ స్థాయిలో త‌ర‌లి వ‌చ్చి ప్ర‌త్యేక పూజ‌లు చేసి త‌రించారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. గుట్ట పరిసరాలు భక్తుల రద్దీతో, వాహనాలతో కిక్కిరిసి కనిపించాయి. దర్శన సమయం రెండు మూడు గంటలు పట్టడంతో భక్తులు క్యూ లైన్ లో ఓపిగ్గా నిరీక్షించాల్సి వచ్చింది. స్వాతి నక్షత్రం […]

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని పూజ‌లు చేశారు.

ఆదివారం సెలవు రోజు కావ‌డంతో భక్తులు భారీ స్థాయిలో త‌ర‌లి వ‌చ్చి ప్ర‌త్యేక పూజ‌లు చేసి త‌రించారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. గుట్ట పరిసరాలు భక్తుల రద్దీతో, వాహనాలతో కిక్కిరిసి కనిపించాయి.

దర్శన సమయం రెండు మూడు గంటలు పట్టడంతో భక్తులు క్యూ లైన్ లో ఓపిగ్గా నిరీక్షించాల్సి వచ్చింది. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ స్వామికి అష్టోత్తర శతకటాభిషేకం ఘ‌నంగా నిర్వహించారు.