ధన్‌రాజ్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే పరువు నష్టం దావా: నిర్మాతలు

విధాత: ధన్‌రాజ్ క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని అన్నారు నిర్మాతలు పివి నగేష్ కుమార్, రవి పున్నమ్. ‘బుజ్జి ఇలారా’ మూవీ ప్రమోషన్ నిమిత్తం జరిగిన మీడియా సమావేశంలో.. మధుకర్ అనే నటుడు మాట్లాడుతూ.. ధన్ రాజ్ ‘పనిలేని పులిరాజు’ అనే సినిమాలో 70 లక్షల నుండి 80 లక్షలు పోగొట్టుకున్నాడంటూ వ్యాఖ్యలు చేయడంతో.. ఆ సినిమా నిర్మాతలైన నగేష్ కుమార్, రవి పున్నమ్.. అధికారికంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ […]

ధన్‌రాజ్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే పరువు నష్టం దావా: నిర్మాతలు

విధాత: ధన్‌రాజ్ క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని అన్నారు నిర్మాతలు పివి నగేష్ కుమార్, రవి పున్నమ్. ‘బుజ్జి ఇలారా’ మూవీ ప్రమోషన్ నిమిత్తం జరిగిన మీడియా సమావేశంలో.. మధుకర్ అనే నటుడు మాట్లాడుతూ.. ధన్ రాజ్ ‘పనిలేని పులిరాజు’ అనే సినిమాలో 70 లక్షల నుండి 80 లక్షలు పోగొట్టుకున్నాడంటూ వ్యాఖ్యలు చేయడంతో.. ఆ సినిమా నిర్మాతలైన నగేష్ కుమార్, రవి పున్నమ్.. అధికారికంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఆ సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చామని, తెలియ పెట్టకుండా మాట్లాడితే.. పరిణామాలు వేరుగా ఉంటాయని.. వెంటనే ధన్‌రాజ్, మధుకర్ క్షమాపణలు చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ.. ఆ ప్రెస్‌ నోట్‌లో తెలిపారు.

‘‘ధన్ రాజ్ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తాం ధన్ రాజ్ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్‌లో మధుకర్ అనే నటుడు మాట్లాడుతూ.. ‘‘ధన్ రాజ్ పనిలేని పులిరాజు అనే సినిమాలో 70 లక్షలు నుంచి 80 లక్షలు పోగొట్టుకున్నాడంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో ధన్ రాజ్ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. పూర్తి రెమ్యూనరేషన్‌ను అణా పైసలతో సహా తీసుకున్నారు.

పనిలేని పులిరాజు సినిమాకు అయిన ఖర్చు పబ్లిసిటీ, సినిమా మేకింగ్ అంతా కలిపి యాభై లక్షలకు దాటలేదు. సినిమా పేర్ల మీద, ధన్ రాజ్ గురించి సరైన అవగాహన లేని మధుకర్ తొలిసారి మైక్ దొరికిందని అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భవిష్యత్తులో నైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడబోయే సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది.

పొరపాటున సినిమా పేరు చెప్పినా దాని వల్ల మా లాంటి లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేసే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి, ధన్ రాజ్ గారు, మధుకర్ ట్విట్టర్ వేదికగా కానీ, లేదా ఇతర మాధ్యమాల ద్వారాగానీ, ధన్ రాజ్ డబ్బు పొగొట్టుకున్న సినిమా పేర్లను సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. లేదంటే మాకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి.. మేము పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
పివి నగేష్ కుమార్, మరియు రవిపున్నమ్ నిర్మాత’’ అని వారు విడుదల చేసిన ప్రెస్ ‌నోట్‌లో నిర్మాతలు హెచ్చరించారు.