‘ధరణి’ తంటాలతో రెవెన్యూ సిబ్బంది కుస్తీ
విధాత: ధరణి పోర్టల్ లో రైతుల భూములకు సంబంధించి నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కుస్తీ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆ దేశాల మేరకు కలెక్టరేట్ లో వీఆర్వోలు, తహశీల్దారులు నాలుగు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతాల్లోని భూ రికార్డులతో కలెక్టరేట్ కు తరలివచ్చి ధరణి పోర్టల్ నిపుణులతో కలిసి భూ రికార్డులను సరి చేసే ప్రక్రియపై రెండు రోజుల నుండి కుస్తీ పడుతున్నారు. మరో రెండు రోజులపాటు […]

విధాత: ధరణి పోర్టల్ లో రైతుల భూములకు సంబంధించి నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కుస్తీ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆ దేశాల మేరకు కలెక్టరేట్ లో వీఆర్వోలు, తహశీల్దారులు నాలుగు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతాల్లోని భూ రికార్డులతో కలెక్టరేట్ కు తరలివచ్చి ధరణి పోర్టల్ నిపుణులతో కలిసి భూ రికార్డులను సరి చేసే ప్రక్రియపై రెండు రోజుల నుండి కుస్తీ పడుతున్నారు.
మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రైతుల భూ రికార్డులలో మిస్ కాబడిన భూమి వివరాలను రికార్డులు, డాక్యుమెంట్లు ఆధారంగా సదరు రైతుల ఆన్లైన్ ఖాతాలలో జత చేస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది తమ భూ రికార్డుల పుస్తకాలతో, కంప్యూటర్లతో కలెక్టరెట్ కారిడార్ లోనే కుర్చీలు, టేబుళ్లు వేసుకొని పడుతున్న తంటాలు చూసే వారికి ధరణి పోర్టల్ పెడుతున్న తిప్పలకు నిదర్శనంగా కనిపిస్తుంది.