రోడ్డున పడి కొట్టుకోకుర్రి.. లోలోన తన్నుకోర్రి! టీ కాంగ్రెస్ నేతలకు డిగ్గీ రాజా సూచన!

విధాత: కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, సవాళ్లు విసురుకుంటూ మొత్తం పార్టీని ముంచేసే స్థాయికి తీసుకొచ్చారు. ఇదిలా కంటిన్యూ అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముక్కలు చెక్కలై కేసీఆర్ కు మరో అవకాశం ఇచ్చినట్లే అవుతుందని భావించిన హాయ్ కమాండ్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగును ట్రబుల్ షూటర్‌గా భావించి హైదరాబాద్ పంపింది. ఈ నేపథ్యంలో ఆయన నాయకులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే తరుణంలో […]

  • By: krs    latest    Dec 24, 2022 3:45 AM IST
రోడ్డున పడి కొట్టుకోకుర్రి.. లోలోన తన్నుకోర్రి! టీ కాంగ్రెస్ నేతలకు డిగ్గీ రాజా సూచన!

విధాత: కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, సవాళ్లు విసురుకుంటూ మొత్తం పార్టీని ముంచేసే స్థాయికి తీసుకొచ్చారు. ఇదిలా కంటిన్యూ అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముక్కలు చెక్కలై కేసీఆర్ కు మరో అవకాశం ఇచ్చినట్లే అవుతుందని భావించిన హాయ్ కమాండ్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగును ట్రబుల్ షూటర్‌గా భావించి హైదరాబాద్ పంపింది.

ఈ నేపథ్యంలో ఆయన నాయకులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే తరుణంలో ఆయన సున్నితంగా హెచ్చరికలూ జారీ చేశారు. వీధిలో పడి కొట్టుకోవద్దని, పార్టీ పరువు తీయవద్దని హెచ్చరించారు. ‘కలిసి ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని నేతలకు ‘హితబోధ చేశారు. ఇలా వీధుల్లో పడి కొట్టుకొని తిట్టుకుంటే మీరూ గెలవరు.. పార్టీ గెలవదని సంచలన కామెంట్స్ చేశారు.

‘మీరందరికీ చేతులు జోడించి కోరుతున్నా.. సమస్యలుంటే అంతర్గతం చర్చించండి.. బయటకు చెప్పొద్దని అంతటి దిగ్విజయ్ సింగ్ లాంటి నేత కూడా మన తెలంగాణ కాంగ్రెస్ నేతలను బతిమిలాడాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీలో విభేదాలపై ‘ఆల్ సెటిల్డ్.. నో ప్రాబ్లమ్’ అని తేల్చేశాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని దించాలన్నది కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్.

అధిష్టానం నియమించిన ఆయన్ను దించే పని మాత్రం కాదని డిగ్గీ కాంగ్రెస్ సీనియర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకే మీరు సైలెంట్ గా ఉండి పార్టీని అధికారంలోకి తేవడం తప్ప మరో ఆప్షన్ లేదని.. లోపల ఎంతైనా తన్నుకోండి కానీ బయటపడొద్దని డిగ్గీ సూచించిన మాట.. అయితే కాంగ్రెస్‌లో ఎవరికి వారే హై కమాండ్.. ఒకరు చెబితే వినే పరిస్థితులు లేవన్నది అందరికి తెలిసిందే.. అయినా డిగ్గీరాజా ఓ ప్రయత్నం చేశారు.. ఆయన మాట ఎవరు వింటారో.. గ్రూపుల గోల ఎలా కంట్రోల్ అవుతుందో చూడాలి.