తెల్వదూ.. చెబితే వినడు.. KCR మనకి అవసరమా: రేవంత్ చెప్పిన పిట్ట కథ
చెల్లెమ్మ సెంటిమెంట్‌తో విజయమే… వైఎస్సార్ గుర్తుస్తొన్నారు.. రేవంత్ యాత్రతో..: షబ్బిర్అలీ మూడు తరాలకు నేను సీతక్కను విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్‌కు ఏమీ తెలియదు… ఎవరైనా చెప్పినా వినడు. ఇటువంటి కేసీఆర్ మనకు అవసరమా? అంటూ మేడారం నుంచి ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం పస్రాలో జరిగిన సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక పిట్ట కథ చెబుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చేందుకు పొరుగు ఊరికి […]

- చెల్లెమ్మ సెంటిమెంట్‌తో విజయమే…
- వైఎస్సార్ గుర్తుస్తొన్నారు.. రేవంత్ యాత్రతో..: షబ్బిర్అలీ
- మూడు తరాలకు నేను సీతక్కను
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్‌కు ఏమీ తెలియదు… ఎవరైనా చెప్పినా వినడు. ఇటువంటి కేసీఆర్ మనకు అవసరమా? అంటూ మేడారం నుంచి ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం పస్రాలో జరిగిన సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక పిట్ట కథ చెబుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
పిల్లనిచ్చేందుకు పొరుగు ఊరికి పెళ్లి సంబంధానికి పోతే… ఆ ఊరు పెద్దమనిషి పిల్లగాడు చాలా మంచోడు… కానీ, రెండే రెండు చెడ్డ అలవాట్లు ఉన్నాయని చెప్పాడు. 98% మంచోడైయున్నప్పుడు… ఆ రెండు శాతం తప్పులతో ఏమైతదిలే? అని ఆ పిల్లగానికి పిల్లనిచ్చేందుకు సిద్ధమవుతారు.
తీరా తాళి కట్టే సమయానికి నేను కట్టను… అని ఆ పిల్లగాడు మొండికేస్తాడు.
ఇదేందయ్యా అంటూ ఆ పెద్దమనిషిని ప్రశ్నిస్తే? గదే గదా…! ముందే చెప్పిన… ఆ రెండు చెడ్డ అలవాట్లు ఇవే అంటూ వివరించారు. వానికి ఏం తెలవదు… ఎవరైనా చెప్తే వినడు… అంటూ కేసిఆర్ కూడా తాను ఎవరు చెప్పినా వినడని, తనకు ఏమీ తెలవదని చమత్కరించారు. మేడారంలో వేసిన అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
చెల్లెమ్మ సెంటిమెంట్
వైఎస్ చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని రేవంత్ చెబుతూ సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే.. ఈ యాత్ర విజయవంతం అయినట్లేనని నాకు సీతక్క చెల్లె లాంటిది అని చెప్పారు.
వైఎస్ఆర్ గుర్తొస్తున్నారు: షబ్బీర్ అలీ
రేవంత్ యాత్రను చూస్తుంటే నాకు వైఎస్ఆర్ గుర్తొస్తున్నారు. ఆయన చెల్లెమ్మా అంటూ చేవెళ్ల నుంచి యాత్ర చేశారు. రేవంత్ సీతక్క అంటూ ములుగు నుంచి యాత్ర మొదలు పెట్టారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు.
మూడు తరాలకు అక్కను: సీతక్క
నేను పేదింటి బిడ్డనైనా… నన్ను మీరంతా అక్కున చేర్చుకున్నారు. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేస్తుండ్రు.