Donald Trump | సౌత్‌ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం.. నిక్కీ హేలి ఓటమి..

సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు.

Donald Trump | సౌత్‌ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం.. నిక్కీ హేలి ఓటమి..

Donald Trump | సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా మాజీ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. సౌత్ కరోలినా నిక్కీ హేలీ సొంత రాష్ట్రం కావడం, ఇక్కడి నుంచే ఆమె గవర్నర్‌గా ఉండడం గమనార్హం. ఈ విజయంతో డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే వాదన మరింత బలపడింది. డొనాల్డ్ ట్రంప్ సౌత్ కరోలినా కంటే ముందు అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ ప్రైమరీ ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. సౌత్ కరోలినాలో ఓటమితో నిక్కీ హేలీపై ఒత్తిడి పెరుగుతున్నది.

అయితే హేలీ ఇప్పటికీ స్థిరంగా నిలబడి, ఓటములు ఎదురైనప్పటికీ తన అభ్యర్థిత్వంపై ఆశావాద దృక్పథంతో ముందుకుసాగుతున్నారు. సౌత్ కరోలినా విజయంతో జో బిడెన్‌పై మరోసారి 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో తలపడేందుకు మార్గం సుగమమైంది. సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీని ఇంత ఐక్యంగా చూడలేదని అన్నారు. ఓటమి తర్వాత, నిక్కీ హేలీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు సౌత్ కరోలినాలో ఒక రకమైన నిరాశను చూశామని.. మొత్తం దేశంలో ఇదే నిరాశ ఉందన్నారు. డోనాల్డ్ ట్రంప్ జో బిడెన్‌ను ఓడించగలరని తాను అనుకోవడం లేదని.. సౌత్ కరోలినాలో ఏది జరిగినా, తాము తమ వాదనను కొనసాగిస్తానన్నారు. ఇంతకుముందు ఇదే చెప్పానన్నారు. సౌత్‌ కరోలినా అనంతరం మిచిగాన్‌లో ప్రైమరీ ఎన్నికలు జరుగనున్నాయి.