సరొగసి సందేహాలొద్దు.. బేబీ బంప్‌తో ఉపాసన
విధాత: రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రీసెంట్‌గా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సైతం ఎంతో సంబుర పడ్డాడు. చిరంజీవి ఇచ్చిన సమాచారంతో అభిమానుల్లో అంతకుమించిన ఆనందం కనిపించింది. చరణ్ అన్న తండ్రి కాబోతున్నాడు.. త్వరలో జూనియర్ చరణ్ వచ్చేస్తున్నాడంటూ అభిమానులు సంతోషం పంచుకున్నారు. సరిగ్గా అలా ఆనందంలో ఉబ్బితబ్బిబవుతున్న సమయంలోనే ఉపాసన సరొగసి అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డను కంటోంది అనే […]

విధాత: రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రీసెంట్‌గా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సైతం ఎంతో సంబుర పడ్డాడు. చిరంజీవి ఇచ్చిన సమాచారంతో అభిమానుల్లో అంతకుమించిన ఆనందం కనిపించింది. చరణ్ అన్న తండ్రి కాబోతున్నాడు.. త్వరలో జూనియర్ చరణ్ వచ్చేస్తున్నాడంటూ అభిమానులు సంతోషం పంచుకున్నారు.
సరిగ్గా అలా ఆనందంలో ఉబ్బితబ్బిబవుతున్న సమయంలోనే ఉపాసన సరొగసి అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డను కంటోంది అనే వార్త నెట్టింట వైరల్ అయింది. దాంతో మెగా అభిమానుల జోష్‌లో తేడా వచ్చింది. అద్దె గర్భం ద్వారా బిడ్డ ఏంటి? అని అసంతృప్తికి గురయ్యారు. తాజాగా వారి అనుమానాలను ఉపాసన పటాపంచలు చేస్తూ సందేహాలకు తావు లేకుండా తన బేబీ బంప్ లుక్కును విడుదల చేసింది.
వాస్తవంగా నేడు హై సొసైటీలలో ఈ సరొగసి ఎక్కువ అవుతుంది. పాలు ఇస్తే అందం తగ్గుతుందని. బిడ్డలకు మామూలుగా జన్మనిస్తే అసలు అందమే పోతుందనే భ్రమలో చాలామంది ఉన్నారు. ఈ బాపతు మహిళలు టాలీవుడ్‌లో కూడా ఎక్కువయ్యారు. ఆ మధ్య మంచు లక్ష్మీ ప్రసన్న సరొగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిందని ఆమె తండ్రి స్వయంగా మోహన్ బాబు మీడియాకు తెలియజేశాడు.
అదే బాటలో ఉపాసన నడుస్తుందేమోనని మెగా అభిమానులు చాలా భయపడ్డారు. కానీ అదంతా కేవలం పుకారు మాత్రమే. ఫ్యామిలీ పార్టీ కోసం చెర్రీ దంపతులు థాయిలాండ్ వెళ్లారు. అక్కడి ఫోటోలను ఉపాసన షేర్ చేసింది. ఇందులో ఆమె ఎత్తైన పొట్టతో కనిపించడంతో ఇది బేబీ బంప్ లుక్ అని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు.
దీంతో సరొగసి కథనాలకు పుల్ స్టాప్ పడింది. ఎత్తుగా ఉన్న ఆమె పొట్టను చూస్తే గర్భం దాల్చినట్టు కనిపిస్తూనే ఉంది. ఆమె పక్కనే రామ్ చరణ్ ఉన్నాడు., మొత్తానికి ఉపాసన ఈ ఫోటోలు లీక్ చేసి మంచి పని చేసింది. లేదంటే మీడియాలో రకరకాల కథనాలకు ఆస్కారం ఉండేది. దానికి తావు లేకుండా చెర్రీ దంపతులు అనుమానాలకు చెక్ పెట్టేశారు.