రెండు నెలల్లో డబుల్ బెడ్రూమ్‌లు పూర్తి చేయాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో : దేవరకొండ నియోజక వర్గం లో పేద ప్రజల కోసం నిర్మిస్తున్న తుది దశ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పెండింగ్ పనులు రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అంద చేసేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి నియోజక వర్గం లో డబుల్ బెడ్రూమ్‌ ఇండ్ల […]

రెండు నెలల్లో డబుల్ బెడ్రూమ్‌లు పూర్తి చేయాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో : దేవరకొండ నియోజక వర్గం లో పేద ప్రజల కోసం నిర్మిస్తున్న తుది దశ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పెండింగ్ పనులు రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అంద చేసేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి నియోజక వర్గం లో డబుల్ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం ప్రగతి, పోడు సమస్యలు, ఆర్‌&ఆర్ పనుల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా దేవరకొండ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 210 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి కేటాయించినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ నియోజక వర్గంలో డబుల్ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు.

నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల లో అటవీ యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చిన వారికి అటవీ శాఖ వారు భూమి వద్దకు రానివ్వడం లేదని సమస్య పరిష్కరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ, అటవీ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లు టీమ్ గా ఏర్పడి సమస్య ఉన్న గ్రామాలలో షెడ్యూల్ నిర్ణయించి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. అదే విధంగా నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి ఆర్‌&ఆర్‌ పనులు వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్.డి.సి ఆర్‌&ఆర్‌ యూనిట్ 2 రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు