మద్యం మత్తులో కొట్టుకున్న అమ్మాయిలు.. ఎక్కడంటే..? వీడియో
మద్యం సేవించడానికి నిబంధనలు ఏమీ లేవు. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ మద్యం తాగేస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి కూడా మందు కొడుతున్నారు.

మద్యం సేవించడానికి నిబంధనలు ఏమీ లేవు. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ మద్యం తాగేస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి కూడా మందు కొడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మద్యం మత్తు తాగిన మత్తులో ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు అమ్మాయిలు పీకల దాకా మద్యం సేవించి, కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పాలస్సియో మాల్ క్లబ్‌లో కొందరు అమ్మాయిలు పీకల దాకా మద్యం సేవించారు. ఆ తర్వాత క్లబ్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు కొట్టుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. మద్యం మత్తులో కొట్టుకుంటున్న అమ్మాయిలను విడదీసేందుకు అక్కడున్న అబ్బాయిలు ప్రయత్నించారు. కానీ యువతులు మాత్రం వీరంగం సృష్టించారు.
కొందరు అబ్బాయిలు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఇక అమ్మాయిలు కొట్టుకుంటుంటే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. దాదాపు 2 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే యువతుల మధ్య గొడవకు కారణం ఇంకా తెలియరాలేదు. దాదాపు అర గంటకు పైగా ఈ గొడవ కొనసాగినట్లు తెలిసింది. ఎక్సైజ్, అన్సాల్ పోలీసు శాఖ సహకారంతో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.