భయం అక్కర్లేదు.. ఆలూని ఇలా తినొచ్చు!
విధాత: ఆలుగడ్డ కూరల్లో రారాజు. ఏరకంగా వండినా భోజన ప్రియులకు నచ్చకుండా ఉండదు. వేపుడు, కుర్మా, కూర ఏవీ కాదు కరకరలాడే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా టిక్కి, పదార్థం ఏదైనా సరే అందరూ ఇష్ట పడతారు. తినడానికి మాత్రం ఎప్పుడూ జంకే. ఎందుకంటే బరువు పెరుగుతుందో, షుగర్ పెరుగుతుందో అని భయం. కానీ అలాంటి భయాలేవీ అక్కర్లేదని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. బంగాళాదుంపల్లో ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయి అని బ్రిటన్ కు చెందిన పెన్నింగ్టన్ […]

విధాత: ఆలుగడ్డ కూరల్లో రారాజు. ఏరకంగా వండినా భోజన ప్రియులకు నచ్చకుండా ఉండదు. వేపుడు, కుర్మా, కూర ఏవీ కాదు కరకరలాడే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా టిక్కి, పదార్థం ఏదైనా సరే అందరూ ఇష్ట పడతారు. తినడానికి మాత్రం ఎప్పుడూ జంకే. ఎందుకంటే బరువు పెరుగుతుందో, షుగర్ పెరుగుతుందో అని భయం. కానీ అలాంటి భయాలేవీ అక్కర్లేదని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
బంగాళాదుంపల్లో ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయి అని బ్రిటన్ కు చెందిన పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ చేసిన కొత్త అధ్యయనం ఫలితం. ఇప్పటి వరకు ఆలు మీద ఉన్న అన్ని నమ్మకాలు దాదాపు అపోహలే అని చెబుతున్నారు ఇక్కడి నిపుణులు. ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న వారు బరువు తగ్గారట.
ఎలా తినాలి?
బరువు విషయం అంటున్నారు నిజమే కానీ ఏ రూపంలో తింటే మంచిదనే దాని మీద ఆధారపడి ఈ ఫలితాలు ఉంటాయని ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అంటున్నారు. ఉడకబెట్టిన ఆలుగడ్డల వల్ల షుగర్ పెరగదని చెబుతున్నారు.
ఈ స్టడీలో పాల్గొన్న వారు బరువు తగ్గారట. ఏ రకమైన పదార్థాలు తయారు చేస్తారు? తయారీ తీరు ఏమిటి? వంటి అనేక విషయాల మీద ఆలుగడ్డల వల్ల అనారోగ్యం కలుగుతుందా ఆరోగ్యానికి మేలు చేస్తాయా అనేది ఆధార పడి ఉంటుందని వీళ్లు చెప్పిన దాన్ని బట్టి ఉడక బెట్టిన ఆలుగడ్డల వల్ల షుగర్ పెరగదట.
ఆలులో గ్లైకోఆల్కలాయిడ్స్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ బాధితులకు కూడా మంచిదని పోలాండ్ పోజ్నాన్ లోని ఆడమ్ మిక్కీవిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తొక్కలో పోషకాలు
ఆలు మీద ఉండే తొక్కలో పోషకాలు ఎక్కువ. ఇందులోని విటమిన్ సి చక్కని యాంటీ ఆక్సిడెంట్, ఫ్లెవనాయిడ్స్, కెరొటినాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాల రూపంలో ఆలులో ఉంటాయి. యాంటి యాక్సిడెంట్స్ ప్రీరాడికల్ చర్యలను నిరోధిస్తాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగితే క్యాన్సర్, గుండెజబ్బుల వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
తిన్నది అరిగేందుకు
మంచి బ్యాక్టీరియా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఆలు ఇలాంటి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. వీటిలోని రెసిస్టెంట్ స్టార్చ్ అంత త్వరగా జీర్ణం కాదు. నేరుగా పెద్ద పేగులకు చేరుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ ఒక ప్రీబయోటిక్ గా చెప్పుకోవచ్చు.
బ్యూటిరేట్ వంటి షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఈ బ్యూటిరేట్ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద పేగు కణాలకు మంచి ఎనర్జీ సోర్స్. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ఆలు లో పెరగాలంటే సలాడ్ లాగా చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లబడిన ఆలులో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువ.
ఎలాగూ బరువు తగ్గుతారు
ఆకలి తీర్చే ఆలు లో ఫైబర్ ఎక్కువ. బరువు తగ్గాలంటే మాత్రం తప్పకుండా ఉడికించి, కాల్చి మాత్రమే తినాలి. ఆలు తినొచ్చు అన్నారని చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తింటే మేలు కంటే నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. ఉడికించి లేదా కాల్చిన ఆలులో కేలరీలు కూడా తక్కువ. అంతే కాదు ఫ్యాట్ ప్రీ కూడా.
అరటి పండులో కంటే కూడా 40 శాతం ఎక్కువ పొటాషియం దొరుకుతుంది. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్. బీపిని అదుపు ఉంచుతుంది. మంచి నిద్రకు కూడా ఈపోషకం దోహదం చేస్తుంది. కాబట్టి రాత్రి భోజనంలో ఉడికించిన బేబీ ఆలు లేదా మీడియం సైజు కాల్చిన దుంపలు మంచి ఆప్షన్.
దుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ
దుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. మోతాదుకు మించి తింటే బరువు పెరిగే ప్రమాదం ఎలాగూ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ డ్ డైట్ లో భాగంగా కార్బోహైడ్రేట్ల కోసం ఆలు చేర్చుకోవడం మంచిదే. చీకటిగా పొడిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ప్లాస్టిక్ కంటే పేపర్ బ్యాగ్లో పెట్టుకుంటే మంచిది. తొక్క తియ్యకుండా, ఉడికించి తినే ఆలు ఆరోగ్యానికి మేలు అని నిపుణులు సలహా ఇస్తున్నారు.