ఈటల స్వరం మారుతున్నదా?

ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన 9 రౌండ్లలో రెండు మూడు తప్పా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌లో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. మేము నైతికంగా విజయం సాధించాం. టీఆర్‌ఎస్‌ ఇంత ప్రలోభ పెట్టినా ప్రజలు ఆదరించలేదన్నారు. పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు వామపక్షాలు మద్దతు ఇవ్వకపోతే టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా రాదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటో […]

  • By: krs    latest    Nov 06, 2022 10:15 AM IST
ఈటల స్వరం మారుతున్నదా?

ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రకటించిన 9 రౌండ్లలో రెండు మూడు తప్పా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌లో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. మేము నైతికంగా విజయం సాధించాం. టీఆర్‌ఎస్‌ ఇంత ప్రలోభ పెట్టినా ప్రజలు ఆదరించలేదన్నారు.

పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు

వామపక్షాలు మద్దతు ఇవ్వకపోతే టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా రాదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటో అర్థమైందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకున్నది. రేపు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటి? నైతికంగా కేసీఆర్‌ ఓడిపోయారు అని అన్నారు. అయితే ఆయన ఇవాళ చర్చలో బీజేపీ వాదన వినిపించడం కంటే వ్యక్తిగతంగా తాను ఏ పార్టీలో ఉన్నా ధర్మంగా ఉంటాను, నైతిక విలువలకు కట్టుబడి ఉంటాను. ప్రజలతో ఉంటానన్నారు.

12కు 12తో.. గులాబీ వనమైన ఉమ్మడి నల్లగొండ

మొత్తం చర్చలో కేసీఆర్‌ వ్యవహారశైలి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాతే మారిందని, అంతకుముందు ఆయన అలా లేరు అన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమో… కేసీఆర్‌ లాంటి నేతను ఎదరించి బైటికి వెళ్తే జాతీయ పార్టీలో ఉంటే తప్పా తట్టుకోలేము అనుకున్నారో ఏమో గాని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన కలత చెందినట్టు కనిపించింది.

ఈటల, కోమటిరెడ్డితోనే ఎన్నికలు ధనమయం: కేటీఆర్ ఫైర్

ప్రస్తుతం ఈటల రాజేందర్‌ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే మునుగోడు ఫలితం తర్వాత ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే వాదనకు అర్థం లేదని తేలబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ కూడా తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన కృషి ఫలితంగా 20 వేలకు పైగా ఓట్లు సంపాదించుకుంది.

CM KCR ఇన్‌చార్జి గ్రామంలో టీఆర్ఎస్‌కు మెజార్టీ

కాబట్టి దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు ఫలితాల ఆధారం మొత్తం తెలంగాణలోని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండదనేది ఈ ఫలితంతో మరోమారు స్పష్టమైంది. ఇదిలాఉండగా ఈటల రాజేందర్‌ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మాటలు చూస్తే ఆయన అంతరాత్మ ఆ పార్టీతో లేనట్టు అనిపించింది. -ఆసరి రాజు