MLA Rapaka | కొంప ముంచిన నోటి దురద.. ఎమ్మెల్యే రాపాక మీద EC విచారణ

MLA Rapaka విధాత‌: నోరా వీపుకు చేటు తేవద్దు అన్నారు పెద్దలు.. జనాన్ని చుసిన హుషారులో ఏదేదో మాట్లాడడం రాజకీయ నాయుకులకు అలవాటు.. ఒక్కోసారి ఆ మాటలే పీకల మీదకు తెస్తుంటాయి. గత 2019 ఎన్నికల్లో జనసేన తరఫున రాజోలు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (MLA Rapaka) ఆ తరువాత వైసిపి వైపు మొగ్గు చూపుతూ దాని అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆమధ్య మర్చి 24 న […]

MLA Rapaka | కొంప ముంచిన నోటి దురద.. ఎమ్మెల్యే రాపాక మీద EC విచారణ

MLA Rapaka

విధాత‌: నోరా వీపుకు చేటు తేవద్దు అన్నారు పెద్దలు.. జనాన్ని చుసిన హుషారులో ఏదేదో మాట్లాడడం రాజకీయ నాయుకులకు అలవాటు.. ఒక్కోసారి ఆ మాటలే పీకల మీదకు తెస్తుంటాయి. గత 2019 ఎన్నికల్లో జనసేన తరఫున రాజోలు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (MLA Rapaka) ఆ తరువాత వైసిపి వైపు మొగ్గు చూపుతూ దాని అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆయన ఆమధ్య మర్చి 24 న అంతర్వేదిలో జరిగిన వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో చింతలమోరి గ్రామంలో సర్పంచ్ గ పోటీ చేసినపుడు దొంగ ఓట్లు వేసేవాళ్లమని. కొంతమందిని ఇంకా తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి గెలుస్తూ ఉండేవాళ్లమని నోరు జారారు.

ఒక్కొక్క‌రు ఐదు, ప‌ది ఓట్లు వేసేవాళ్లు. ఆ ఓట్లు నా గెలుపులో కీల‌క పాత్ర పోషించేవి” అని అన్నారు. ఆనాడు ఆయన చేసిన కామెంట్స్ రాజ‌కీయ దుమారం రేపాయి. అంటే ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగె దొంగ ఓట్లు వేసుకుని గెలిచారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, విమర్శలు వచ్చాయి.

అంతే కాకుండా కేశవదాసు పాలేనికి చెందిన వేంకటపతి రాజా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి గ‌త నెల 24న ఫిర్యాదు చేసారు. దీంతో విరాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఆజిల్లా క‌లెక్ట‌ర్‌ హిమాన్షుశుక్లా ను చార‌ణ‌కు ఆదేశించారు.

వ‌ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌పై వారంలోపు విచారించి క‌లెక్ట‌ర్ హిమాన్షుశుక్లా నివేదిక స‌మ‌ర్పించాల్సి వుంది. ఏ అందుకొచ్చిన నోటి దురద.. అలా మాట్లాడడం ఎందుకు..విచారణ ఎదుర్కోవడం ఎందుకు అని జనం అంటున్నారు.

అంతే ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి రాపాక పదవి నుంచి తొలగించడం జరగదు కానీ.. ఇదంతా అనవసరపు తలకాయనొప్పి కదా అని ఆయన అభిమానులు చిరాకు పడుతున్నారు.