కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ షాక్
Komatireddy Rajagopal Reddy | విధాత: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మంత్రి అంబటి రాంబాబు.. మాములు ‘కళాకారుడు’ కాదండోయ్! టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ..రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై […]

Komatireddy Rajagopal Reddy | విధాత: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది.
టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ..రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులు జారీచేసింది.
సోమవారం సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని,లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు ఈ నెల 14,18,29 తేదీల్లో నగదు బదిలీ చేసినట్టు శనివారం ఆధారాలతో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
రాజగోపాల్‌రెడ్డి అవినీతి కాంట్రాక్టుల బాగోతాన్ని ఆపరేషన్ బొగ్గు పేరుతో కాంగ్రెస్ నేతలు బట్టబయలు చేశారు. ఈ కాంట్రాక్ట్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో టీ కాంగ్రెస్ నేతలు ఆధారాలతో సహా వివరించారు. కాంట్రాక్ట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా విడుదల చేసింది. సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి సంబంధించిన వివరాలను కూడా కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
రాజగోపాల్‌రెడ్డి అవినీతి కాంట్రాక్టుల బాగోతాన్ని ’ఆపరేషన్ బొగ్గు’ పేరుతో బట్టబయలు చేసిన కాంగ్రెస్ నేతలు..విస్తుపోయే నిజాలను మీరూ తెలుసుకోండి..(1/4) pic.twitter.com/bZJIW2n5mO
— Aapanna Hastham (@AapannaHastham) October 30, 2022