ED RIDES | మెడికల్ కాలేజీల్లో అక్రమాలు నిజమే.. మల్లారెడ్డి కాలేజీలో అనధికార నగదు..
ED RIDES | పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం మనీలాండరింగ్ కింద కేసు నమోదు విధాత, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో సీట్ల కేటాయింపులో అక్రమాలు నిజమేనని ఈడీ ప్రకటించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని సుమారు 10 మెడికల్ కాలేజీలకు సంబంధించిన 16 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గురువారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ.1.40కోట్ల నగదు, […]

ED RIDES |
- పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం
- మనీలాండరింగ్ కింద కేసు నమోదు
విధాత, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో సీట్ల కేటాయింపులో అక్రమాలు నిజమేనని ఈడీ ప్రకటించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని సుమారు 10 మెడికల్ కాలేజీలకు సంబంధించిన 16 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గురువారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇందులో ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ.1.40కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.89 కోట్ల అనధికార నగదు సీజ్ చేశామని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. వరంగల్ పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంపై కేసు నమోదు చేశామని తెలిపారు.
తమ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలలో అనధికారికంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకొని, ఆయా కాలేజీలపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
అలాగే ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపి కాలేజీలలోని ఎలక్ట్రానిక్ వస్తువులను (పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు) స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది.