కొనుగోళ్లలో దళారీల దోపిడీ.. ప్రభుత్వం చర్యలు తీసుకునేలా పోరాడాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలి.. భీంరెడ్డి శతజయంతి వార్షికోత్సవాల నిర్వహణ.. నిర్మాణ పటిష్టతకు పార్టీ జిల్లా, రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు.. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ తీసుకున్ననిర్ణయాలు విధాత, వరంగల్: రెండు రోజులుగా జరుగుతున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు వరంగల్ లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో గల ఓంకార్ భవన్ లో బుధవారం ముగిసాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి, పత్తి పంటలను అమ్ముకోవాలంటే దళారీలు అంతా కలిసి నిండా ముంచుతున్నందున, […]

- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలి..
- భీంరెడ్డి శతజయంతి వార్షికోత్సవాల నిర్వహణ..
- నిర్మాణ పటిష్టతకు పార్టీ జిల్లా, రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు..
- ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ తీసుకున్ననిర్ణయాలు
విధాత, వరంగల్: రెండు రోజులుగా జరుగుతున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు వరంగల్ లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో గల ఓంకార్ భవన్ లో బుధవారం ముగిసాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి, పత్తి పంటలను అమ్ముకోవాలంటే దళారీలు అంతా కలిసి నిండా ముంచుతున్నందున, రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆ దిశగా కార్యకర్తలు స్థానికంగా పోరాడాలని కమిటి నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ల హామీని అమలు చేయడానికి బడ్జెట్లో ప్రత్యేక నిధిని కేటాయించి తక్షణమే ఇండ్ల నిర్మాణానికి పూనుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే డిసెంబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చింది.
రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మీడియాకు వెల్లడించారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) పార్టీ ప్రజాసంఘాల నిర్మాణ పటిష్టతకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సంసిద్ధం చేయడానికి జిల్లా రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని ఎంసీపీఐ (యు) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
భీంరెడ్డి శత జయంతి ఉత్సవాలు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అమరజీవి కామ్రేడ్ భీంరెడ్డి నరసింహారెడ్డి శత జయంతి వార్షికోత్సవాలను జిల్లా డివిజన్ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని, అలాగే జనవరి 9న వామపక్ష ప్రజాతంత్ర సామాజిక మేధావులతో హైదరాబాదులో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
పార్టీ నిర్మాణ ప్రతిష్టతకు భవిష్యత్తు కార్యాచరణకు జిల్లా ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని అనంతరం మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో నర్సంపేటలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే సమావేశాలతోపాటుగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పటు చేయాలని నిర్ణయించామన్నారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, కుంభం సుకన్య, వస్కుల మట్టయ్య, గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎస్ కే నజీర్, తుకారాం నాయక్, ఎన్ రెడ్డి హంసారెడ్డి, గడ్డం నాగార్జున, నర్ర ప్రతాప్, కర్ర రాజిరెడ్డి, కంచ వెంకన్న, జబ్బర్ నాయక్, కొమురయ్య, రాగసుధ, కళావతి, సావిత్రి, పుష్ప, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.