ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కంటి వైద్య శిబిరం.. ప్రారంభించిన గుత్తా, పోచారం
విధాత: తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిభిరాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు , పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు , లెజిస్లేటివ్ సెక్రటరీ డా. […]

విధాత: తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిభిరాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు , పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు , లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కంటివెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటివేలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, కంటివెలుగు పథకం పేదలకు ఎంతో ఉపయోగకరమన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిభిరాన్ని ఈరోజు ప్రారంభించిన శాసన సభాపతి శ్రీ పోచారం @PSRTRS గారు, శాసనమండలి చైర్మన్ @SukenderGutha గారు.
• కంటివెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం
• కంటివెలుగు వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరం. pic.twitter.com/XKGHhO7qJb
— Telangana Kanti Velugu (@KantiVelugu) February 8, 2023
ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మన కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారన్నారు. కంటి వెలుగు పథకం అనేది పేద ప్రజలకు ఒక వరం లాంటిదని, గౌరవ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.