మంచిప్ప వద్ద ఉద్రిక్తత.. కాళేశ్వరం పనులపై రైతుల ఆందోళన

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప వద్ద కాళేశ్వరం పనులను నిలిపి వేయాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘ‌ట‌న‌తో మరోసారి కాళేశ్వరం రిజర్వాయర్ పనులపై వివాదం రాజుకుంది. మోపాల్ మండలం మంచిప్ప వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పనులు అడ్డుకుంటామని పిలుపు నివ్వడంతో సమీప గ్రామాల రైతులు, భూ నిర్వాసితులు అధిక సంఖ్య‌లో తరలివచ్చారు. పలువురు ఉద్యమ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాళేశ్వరం 22 వ ప్యాకేజీలో భాగంగా […]

  • By: krs    latest    Jan 20, 2023 11:05 AM IST
మంచిప్ప వద్ద ఉద్రిక్తత.. కాళేశ్వరం పనులపై రైతుల ఆందోళన

విధాత, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప వద్ద కాళేశ్వరం పనులను నిలిపి వేయాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘ‌ట‌న‌తో మరోసారి కాళేశ్వరం రిజర్వాయర్ పనులపై వివాదం రాజుకుంది.

మోపాల్ మండలం మంచిప్ప వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పనులు అడ్డుకుంటామని పిలుపు నివ్వడంతో సమీప గ్రామాల రైతులు, భూ నిర్వాసితులు అధిక సంఖ్య‌లో తరలివచ్చారు. పలువురు ఉద్యమ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

కాళేశ్వరం 22 వ ప్యాకేజీలో భాగంగా మంచిప్ప కొండెము చెరువు వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ 0.84 టిఏంసి నుండి 3.5 టిఏంసిల సామర్థ్యానికి ఎత్తు పెంచడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తు న్నారు. ప్రాజెక్టు రీ డిజైన్ ద్వారా ఆయకట్టు పరిధి పెరిగేది లేదని, తమ భూములు ఎక్కువగా ముంపునకు గుర‌వుతాయ‌ని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రీ-డిజైన్ చేసి 3.5 టిఎంసిల ఎత్తు పెంచడాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తోన్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో మంచిప్ప వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.