FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు బీభత్సం.. ఒకరు మృతి
విధాత: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధి అత్వెల్లి వద్ద రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ప్రతాప్ రెడ్డి కారు.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, వంటేరు ప్రతాప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడిని మేడ్చల్‌కు చెందిన నర్సింహులుగా పోలీసులు గుర్తించారు. […]

విధాత: మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధి అత్వెల్లి వద్ద రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ప్రతాప్ రెడ్డి కారు.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, వంటేరు ప్రతాప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడిని మేడ్చల్‌కు చెందిన నర్సింహులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్ రెడ్డి కొంపల్లి నుంచి తూప్రాన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.