‘ఫార్ములా కార్ రేసింగ్.. ట్రాఫిక్ ఆంక్షలు
విధాత: హైదరాబాద్ మహానగరం మరో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ కార్ల మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్(ఫార్ములా ఈ రేసింగ్) జరగబోతున్నది. దీనికోసం హుస్సేన్‌సాగర్ తీరంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్ మంటూ కార్ల మోత మోగనున్నది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌లో భాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్ జరగనున్నది. ఇవాళ […]

విధాత: హైదరాబాద్ మహానగరం మరో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ కార్ల మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్(ఫార్ములా ఈ రేసింగ్) జరగబోతున్నది. దీనికోసం హుస్సేన్‌సాగర్ తీరంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో రయ్ మంటూ కార్ల మోత మోగనున్నది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌లో భాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్ జరగనున్నది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాల పాటు ఈ రేసింగ్ జరుగుతుంది. రేసింగ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు చాలామంది ఇక్కడికి చేరుకున్నారు.
ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ నుంచి ఐమాక్స్ కూడలి, తెలుగుతల్లి కూడలి వెళ్లే మార్గాలు మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి.