Rajasthan | రాజస్థాన్‌లో ఘోరం.. కుటుంబం హత్య.. ఆపై దహనం
Rajasthan విధాత: ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పూర్ జిల్లాలోని చీరాయి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూనరాం(55), భన్వారి(50) అనే ఇద్దరు దంపతులు తమ పిల్లలతో కలిసి చీరాయి గ్రామంలో నివాసముంటున్నారు. అయితే మంగళవారం రాత్రి పూనరాం ఇంటికి గుర్తు తెలియని దుండగులు వచ్చారు. పూనరాం, భన్వారి, కోడలు ధాపు(23), మనుమరాలు(6)ను గొడ్డలితో […]

Rajasthan
విధాత: ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పూర్ జిల్లాలోని చీరాయి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూనరాం(55), భన్వారి(50) అనే ఇద్దరు దంపతులు తమ పిల్లలతో కలిసి చీరాయి గ్రామంలో నివాసముంటున్నారు.
అయితే మంగళవారం రాత్రి పూనరాం ఇంటికి గుర్తు తెలియని దుండగులు వచ్చారు. పూనరాం, భన్వారి, కోడలు ధాపు(23), మనుమరాలు(6)ను గొడ్డలితో గొంతు కోసి చంపారు. ఆ తర్వాత మృతదేహాలను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంటి ఆవరణ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూనరాం స్థానికంగా ఉన్న స్టోన్ క్వారీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంధువులే పూనరాం కుటుంబాన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోరానికి పగనే కారణమని తెలుస్తోందన్నారు. హత్యలు జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.