Kohli: మరి కొద్ది రోజులలో 2023 వరల్డ్ కప్ మొదలు కానుండగా, భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. దీంతో టీమిండియా కప్ కొడుతుందని భారతీయ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేయడంతో ఏ జట్లు ఎవరెవరిని ఎదుర్కొనబోతున్నాము అనే దానిపై క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్క టీం కూడా కప్ కొట్టాలనే ఉద్దేశంలో సన్నాహాలు చేసుకుంటున్నాయి. స్వదేశంలో మ్యాచ్ జరగనుండడంతో టీమిండియా టైటిల్ […]
Kohli: మరి కొద్ది రోజులలో 2023 వరల్డ్ కప్ మొదలు కానుండగా, భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. దీంతో టీమిండియా కప్ కొడుతుందని భారతీయ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేయడంతో ఏ జట్లు ఎవరెవరిని ఎదుర్కొనబోతున్నాము అనే దానిపై క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్క టీం కూడా కప్ కొట్టాలనే ఉద్దేశంలో సన్నాహాలు చేసుకుంటున్నాయి. స్వదేశంలో మ్యాచ్ జరగనుండడంతో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతుంది. అయితే ప్రస్తుతం టీమ్‌లో ఉన్న పలువురు సీనియర్ ఆటగాళ్లకి ఇదే చివరి వరల్డ్ కప్ అని చెబుతున్నారు.
ముఖ్యంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సారి విరాట్ కోహ్లీ కోసమైన కప్ గెలవండి అని అభిమానులు కోరుతున్నారు. అయితే విరాట్ చివరి వరల్డ్ కప్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ స్పందించారు. స్వదేశంలో భారత్ ఎప్పుడు ఆడిన కూడా ఫేవరెట్ గానే ఉంటుంది . అంతేకాక భారత ఆటగాళ్లపై అంచనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అంటూ క్రిస్ గేల్ కామెంట్ చేశాడు ఈసారి వరల్డ్ కప్ లో పోటీ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది అని కూడా ఆయన తెలిపాడు.
అయితే విరాట్ కోహ్లీకి ఇదే చివరి ప్రపంచ కప్ అని నేను భావించను, అతను మరో వరల్డ్‌కప్ టోర్నీ ఆడగల సత్తా ఉంది.. స్వదేశంలో ఆడుతున్న టీమిండియా ఎలాంటి జట్టును ఎంపిక చేస్తుంది, ఆ జట్టును నేను చూడాలని ఎదురుచూస్తున్నాఅని క్రిస్ గేల్ అన్నాడు. కాగా, గతంలో క్రిస్ గేల్ బెంగళూరు జట్టు తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది.